KKR vs GT IPl 2023 : కోల్ కతా షాక్ గుజరాత్ కు ఝలక్
భారీ స్కోర్ ను ఛేదించిన కేకేఆర్
KKR vs GT IPl 2023 : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగిన ఈ మ్యాచ్ కలకాలం గుర్తుండి పోయేలా చేసింది. వరుస విజయాలతో దూసుకు పోతున్న గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించింది కోల్ కతా నైట్ రైడర్స్ .
నితీష్ రాణా సారథ్యంలోని కేకేఆర్ జట్టుకు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్ లో ఓటమి పాలైనా రెండో మ్యాచ్ లో కోల్ కతా వేదికగా బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును బోల్తా కొట్టించింది. ప్రధానంగా ఢిల్లీ గల్లీ పోరడు సూయష్ శర్మ , వరుణ్ చక్రవర్తి, సునీల్ సరైన్ ల అద్భుతమైన బంతులకు చాప చుట్టేశారు.
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్(KKR vs GT IPl 2023) కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది. అనారోగ్యం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కోల్ కతా తో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో ఆఫ్గనిస్తాన్ కు చెందిన స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ స్టాండింగ్ కెప్టెన్ గా వ్యవహరించాడు.
ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 205 పరుగుల బిగ్ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా విస్తు పోయేలా చేసింది. రింకూ సింగ్ అసాధారణమైన ఇన్నింగ్స్ తో చెలరేగాడు. అతడు కొట్టిన దెబ్బకు గుజరాత్ విల విల లాడింది.
Also Read : రషీద్ ఖాన్ తొలి హ్యాట్రిక్