KKR v LSG IPL 2022 : దంచి కొట్టిన డికాక్ రెచ్చి పోయిన రాహుల్
ఆకాశమే హద్దుగా దంచి కొట్టిన క్వింటన్
KKR v LSG IPL 2022 : ఐపీఎల్ 2022లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్(KKR v LSG IPL 2022) తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోర్ సాధించింది. 210 పరుగుల టార్గెట్ ముందుంచింది.
ఇక లక్నో ఆటగాడు, స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా 140 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోల్ కతా బౌలర్ల భరతం పట్టాడు. ఎవరినీ వదిలి పెట్టలేదు.
బంతుల్ని బౌండరీ లైన్ దాటించాడు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ధాటిగా ఆడాడు. 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
కోల్ కతా నైట్ రైడర్స్(KKR v LSG IPL 2022) పేలవమైన ఫీల్డింగ్ కారణంగా రెండుసార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు డీకాక్. ఆ తర్వాత రెచ్చి పోయాడు. అభిజిత్ చేతిలోకి వచ్చిన బంతిని జార విడిచాడు.
మరో వైపు కీపర్ బిల్లింగ్స్ సైతం డికాక్ ఇచ్చిన క్యాచ్ వదిలేశాడు. దీంతో డికాక్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చెలరేగాడు. ఇదిలా ఉండగా క్వింటన్ డికాక్ 70 బంతులు మాత్రమే ఆడాడు .
ఇందులో 10 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి. అంటే కేవలం 140 పరుగుల్లో ఫోర్లు, సిక్సర్లతోనే 100 పరుగులు చేశాడు క్వింటన్ డికాక్.
కెప్టెన్ కేఎల్ రాహుల్ 51 బంతులు ఎదుర్కొని 68 పరుగులు చేశాడు.
ముంబై లోని డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Also Read : ఇక క్రికెట్ కు సెలవు – కేటీ మార్టిన్