KL Rahul : ఎన్సీఏలోనే కేఎల్ రాహుల్

గాయం త‌ర్వాత ఆసియా క‌ప్ కు

KL Rahul : ఆసియా క‌ప్ అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ఈ టోర్నీలో ఆరు జ‌ట్లు పాల్గొంటున్నాయి. నేపాల్, భార‌త్, పాకిస్తాన్, ఆఫ్గ‌నిస్తాన్ , నేపాల్ , బంగ్లాదేశ్ ఆడుతున్నాయి. ఇదిలా ఉండ‌గా భార‌త జ‌ట్టు త‌ర‌పున ఏరి కోరి కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసింది బీసీసీఐ.

KL Rahul in NCA

ఇదిలా ఉండ‌గా కేఎల్ రాహుల్ గాయం ఇంకా మాన‌క పోవ‌డంతో ఆసియా క‌ప్ టోర్నీలో భాగంగా భార‌త జ‌ట్టు త‌ల‌ప‌డే నేపాల్ , దాయాది పాకిస్తాన్ జ‌ట్ల‌తో జ‌రిగే మ్యాచ్ ల‌లో పాల్గొన‌డం లేదు. దీంతో బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్సీఏ) లో చేరాడు కేఎల్ రాహుల్.

ఆయా జ‌ట్ల‌తో తాను ఆడ‌డం లేదంటూ బీసీసీఐ(BCCI) ప్ర‌క‌టించింది. అప్ప‌టి వ‌ర‌కు ఎన్సీఏలోనే శిక్ష‌ణ తీసుకుంటార‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రో వైపు కేఎల్ రాహుల్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గాయాల బారిన ప‌డిన రాహుల్ ను ఎందుకు భార‌త జ‌ట్టుకు ఎంపిక చేశారంటూ మండిప‌డుతున్నారు ఫ్యాన్స్.

కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను స్టాండ్ బై క్రికెట‌ర్ గా ఎందుకు ఎంపిక చేశారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తంగా కేఎల్ రాహుల్ ను టోర్నీ నుంచి తొల‌గించాల‌ని శాంస‌న్ కు ఛాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నారు.

Also Read : Asia Cup 2023 Ceremony : ఆక‌ట్టుకున్న ఆసియా క‌ప్ సంబురం

Leave A Reply

Your Email Id will not be published!