KL Rahul : భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ప్లేయర్, లక్నో సూపర్ జెయింట్స్ స్కిప్పర్ కేఎల్ రాహుల్(KL Rahul ) ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎందుకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ను ఎందుకు వీడాల్సి వచ్చిందనే దానిపై ఇవాళ స్పందించాడు.
నాలుగు సంవత్సరాల పాటు ఆ ఫ్రాంచైజీకీ ఆడాను. వ్యక్తిగతంగా రాణించినా నాయకుడిగా విఫలం కావడం అన్నది కొంచెం ఇబ్బందికరంగా మారందన్నాడు. ఇదే సమయంలో తన వైపు నుంచి వంద శాతం ఎఫర్ట్ పెట్టేందుకు ప్రయత్నం చేశానని చెప్పాడు.
సుదీర్ఘ కాలం పాటు ఒకే జట్టుకు ఆడడం వల్ల కొంత అన్ ఈజీ ఏర్పడిందని తెలిపాడు. దీంతో కొత్త జట్టుకు ఆడాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని తాను పంజాబ్ జట్టు మేనేజ్ మెంట్ కు తెలియ చేశానని చెప్పాడు.
ఆ జట్టు నుంచి నిష్క్రమించడం తనను ఎంతగానో బాధకు గురి చేసిందన్నాడు. డబ్బుల కోసం లక్నో జెయింట్స్ జట్టుకు వెళ్ల లేదన్నాడు. కానీ ఏదైనా కొత్తదనం ఉండాలనే ఉద్దేశంతోనే తాను పంజాబ్ ను వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు కేఎల్ రాహుల్9KL Rahul ).
ఇదిలా ఉండగా రాహుల్ గత ఏడాది దుబాయ్ లో జరిగిన 14వ సీజన్ ఐపీఎల్ లో జట్టును గట్టెక్కించ లేక పోయాడు. కానీ వ్యక్తిగతంగా 13 ఇన్నింగ్స్ లలో 626 రన్స్ చేశాడు.
ప్లేయర్ గా వంద మార్కులు పడినా స్కిప్పర్ గా ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్ టోర్నీ ఈనెల 26న ముంబై వేదికగా జరగనుంది. సత్తా చాటేందుకు రెడీగా ఉన్నానని చెప్పాడు రాహుల్.
Also Read : ఓటమి నుంచి కాపాడిన కెప్టెన్