KL Rahul : ఆడితేనే నిలబడతాం లేకపోతే కష్టం
భారత టెస్టు తాత్కాలిక కెప్టెన్ రాహుల్
KL Rahul : బంగ్లాదేశ్ టూర్ లో ఉన్న భారత జట్టు ఇప్పటికే వన్డే సీరీస్ కోల్పోయింది. ఆఖరి మ్యాచ్ లో గెలుపొంది పరువు పోకుండా కాపాడుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయాల పాలవడంతో అతడి స్థానంలో తాత్కాలిక కెప్టెన్ గా కేఎల్ రాహుల్(KL Rahul) సారథ్యం వహిస్తున్నాడు. అతడికి తోడుగా చతేశ్వర్ పుజారా ఉప సారథిగా ఉన్నాడు.
ఈ తరుణంలో డిసెంబర్ 14 బుధవారం నుంచి భారత జట్టు టెస్టు సీరీస్ కు రెడీ అవుతోంది. మొదటి టెస్టు 14 నుంచి 18 వరకు కొనసాగనుంది. రెండో టెస్టు 22 నుంచి 26 వరకు జరగనుంది. ఈ సందర్భంగా టెస్టు సీరీస్ కప్ ను బంగ్లాదేశ్ , భారత జట్టు కెప్టెన్లు షకీబ్ ఉల్ హసన్ , కేఎల్ రాహుల్ ట్రోఫీని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవడం మా ముందున్న టార్గెట్. ప్రతి ఒక్కరం ఆటపై ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు కేఎల్ రాహుల్(KL Rahul). ఐదు రోజుల మ్యాచ్ లో నిలకడగా ఆడుతూ సాధ్యమైనన్ని పరుగులు చేస్తే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందన్నారు.
మమ్మల్ని గాయాలు బాధిస్తున్నాయి. ప్రధానమైన ఆటగాళ్లు లేక పోవడం ఇబ్బందికరమే. కానీ మా జట్టు ఇప్పుడు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చేందుకు రెడీగా ఉందన్నాడు కేఎల్ రాహుల్. ఇదిలా ఉండగా టీమిండియాలో రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా లేకుండానే భారత్ బరిలోకి దిగనుంది.
మరో వైపు ఆడక పోయినా రిషబ్ పంత్ ను కంటిన్యూగా ఎంపిక చేస్తూ వస్తోంది బీసీసీఐ.
Also Read : హ్యాట్సాఫ్ శాంసన్ నిబద్దతకు సలాం