KL Rahul : ఐదోసారి 500 ర‌న్స్ చేసిన రాహుల్

కేఎల్ రాహుల్ అరుదైన రికార్డ్

KL Rahul : ఐపీఎల్ 2022లో అరుదైన ఘ‌న‌త సాధించాడు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ తో క‌లిసి 210 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

70 బంతుల్లో క్వింట‌న్ డికాక్ 140 ర‌న్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు 10 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో కేఎల్ రాహుల్(KL Rahul) 50 బంతులు ఆడి 5 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 68 ర‌న్స్ చేశాడు.

చారిత్రాత్మ‌క ఫీట్ సాధించిన తొలి భార‌తీయ బ్యాట‌ర్ గా చ‌రిత్ర సృష్టించారు. వ‌రుస‌గా ఐపీఎల్ సీజ‌న్ లో 500 ప‌రుగుల‌కు చేరుకున్నాడు. రాహుల్, డికాక్ విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్ తో ముంబై లోని డీవై పాటిల్ స్టేడియం ద‌ద్ద‌రిల్లింది.

ఇదిలా ఉండగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో వ‌రుస‌గా ఐదోసారి 500 ప‌రుగుల మైలు రాయిని అధిగమించాడు కేఎల్ రాహుల్(KL Rahul). ఇంత వ‌ర‌కు ఏ ఇండియ‌న్ ప్లేయ‌ర్ ఈ ఘ‌న‌త‌ను సాధించ‌క పోవ‌డం విశేషం.

ఈ లీగ్ మ్యాచ్ 66వ‌ది. ఇక ఐపీఎల్ లో 2018లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున కేఎల్ రాహుల్ 659 ర‌న్స్ చేశాడు. 2019లో రాహుల్ 593 ప‌రుగుల‌తో ముగించాడు.

2020లో యూఏఇ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ 670 ర‌న్స్ చేసి ఆరెంజ్ క్యాప్ ను అందుకున్నాడు. ఇక గ‌త ఏడాది 2021లో దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 14వ సీజ‌న్ లో 13 మ్యాచ్ లలో 616 ప‌రుగులు చేశాడు.

కాగా ఇంకా ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇంకెన్ని ప‌రుగులు చేస్తాడో రాహుల్ వేచి చూడాలి.

Also Read : ఆకాశ‌మే హ‌ద్దుగా విధ్వంస‌మే తోడుగా

Leave A Reply

Your Email Id will not be published!