KL Rahul : కేఎల్ రాహుల్ జోర్దార్ ఇన్నింగ్స్

103 ప‌రుగులు 12 ఫోర్లు 4 సిక్స‌ర్లు

KL Rahul : ఐపీఎల్ 2022లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్కిప్ప‌ర్ కేఎల్ రాహుల్ అదే జోరు కొన‌సాగిస్తూ వ‌స్తున్నాడు. ముంబైలో ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో బాధ్య‌తాయుతమైన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు.

టాస్ గెలిచిన ముంబై స్కిప్ప‌ర్ రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 168 ర‌న్స్ చేసింది. ఈ మ్యాచ్ లో 36 ప‌రుగుల తేడాతో ల‌క్నో విజ‌యం సాధించింది.

ఈ గెలుపులో కెప్టెన్ రాహుల్ కీల‌క పాత్ర పోషించాడు. ఒకానొక స‌మ‌యంలో వికెట్లు కోల్పోయినా త‌న‌దైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. 62 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్(KL Rahul) 103 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఇందులో 12 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక ఐపీఎల్ 15వ సీజ‌న్ లో ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ కూడా ఉన్నాడు. కానీ టాప్ లో మాత్రం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్టార్ హిట్ట‌ర్, ఇంగ్లండ్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ నిలిచాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు 491 ర‌న్స్ చేశాడు. ఇక ముంబై ఇన్సింగ్ లో రోహిత్ శ‌ర్మ ఒక్క‌డే మెరిశాడు. 39 ర‌న్స్ చేశాడు. కానీ జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయాడు. ల‌క్నోకు బాధ్యతాయుత‌మైన ఇన్నింగ్స్ ఆడ‌డ‌మే కాదు జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు రాహుల్.

ఇక ముంబై ఇండియ‌న్స్ కు ఇది వ‌రుస‌గా ఎనిమిదో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేదు. ఇక మాజీ డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ 2 మ్యాచ్ ల‌లో గెలిచి ప‌రువు పోకుండా కాపాడుకుంది.

Also Read : కోహ్లీ ఇలా ఆడితే కెరీర్ క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!