Kohli Anushka Sharma : జాతీయ జెండా ఎగ‌రేసిన కోహ్లీ

స‌లాం చేసిన అనుష్క శ‌ర్మ‌

Kohli Anushka Sharma : కేంద్ర స‌ర్కార్ ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మంలో భాగంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా కు శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్ల‌వుతోంది.

76 ఏళ్ల‌కు అడుగు పెట్టింది. ఈ సంద‌ర్బంగా పంధ్రాగష్టు సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ దేశ రాజ‌ధాని ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. హ‌ర్ ఘ‌ర్ తిరంగ క్యాంపెయిన్ లో విరాట్ కోహ్లీతో క‌లిసి ఫోటో షేర్ చేశారు అనుష్క శ‌ర్మ‌(Kohli Anushka Sharma).

ఇన్ స్టా గ్రామ్ లో మ‌న స్వాతంత్రానికి 75 ఏళ్లు నిండాయంటూ పేర్కొంది. ప్ర‌ధాన మంత్రి ప్ర‌తి ఒక్క‌రు జాతీయ జెండాను ఎగుర వేయాల‌ని కోరారు.

అనుష్క శ‌ర్మ ప్రముఖ న‌టి. విరాట్ కోహ్లీ ప్ర‌ముఖ క్రికెట‌ర్ . ఇద్ద‌రూ క‌లిసి వారి ఇంటి వ‌ద్ద జాతీయ జెండాను ఎగుర వేశారు. జెండాతో పాటు చిత్రాన్ని పంచుకున్నారు.

తెల్ల‌టి కుర్తాలో విరాట్ ప‌క్క‌న నిల‌బ‌డిన అనుష్క నవ్వుతూ క‌నిపించింది. 140 కోట్ల ప్ర‌జ‌ల‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయులంద‌రికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్ష‌లు అని తెలిపారు కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌.

మేరా భార‌త్ మ‌హాన్, జై హింద్ అంటూ పేర్కొన్నారు. ప్ర‌ధాని కోరిక మేర‌కు సోష‌ల్ మీడియాలో త‌మ ఖాతాల‌లో ఫోటోను జాతీయ జెండాను చేర్చాల‌ని కోరారు.

ఈ మేర‌కు విరాట్ కోహ్లీ త‌న ప్రొఫైల్ ఫోటోను త్రివ‌ర్ణ ప‌తాకం చేర్చాడు. ఎంద‌రో త్యాగాల ఫ‌లితమే ఈ స్వాతంత్రం. వారంద‌రు చేసిన బ‌లిదానాలు మ‌న‌కు పాఠాలు కావాల‌ని పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ.

 

Also Read : కోహ్లీ ఫామ్ లోకి వ‌స్తే క‌ష్టం – స‌ల్మాన్ భ‌ట్

Leave A Reply

Your Email Id will not be published!