Virat Kohli : బ్రాండ్ వాల్యూలో కోహ్లీనే ఐకాన్

సెకండ్ ప్లేస్ లో ర‌ణ్ వీర్ సింగ్

Virat Kohli : భార‌త క్రికెట్ స్టార్ ప్లేయ‌ర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)మ‌రోసారి బ్రాండ్ వాల్యూలో స‌త్తా చాటాడు. వరుస‌గా టాప్ లో నిలిచాడు. ఏకంగా మ‌నోడు 186 మిలియ‌న్ డాల‌ర్ల బ్రాండ్ విలువ‌తో భార‌త దేశ‌పు అత్యంత విలువైన సెల‌బ్రెటీగా నిలిచాడు.

ఇక మ‌హిళా విభాగంలో ఆలియా భ‌ట్ (Alia Bhatt) 68.1 మిలియ‌న్ల బ్రాండ్ వాల్యూతో టాప్ లో నిలిచింది మ‌హిళా విభాగంలో. 2021 లో వ‌న్డే, టీ20, టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసినా త‌న వాల్యూ ఎంత మాత్రం త‌గ్గ‌లేదు కోహ్లీది (Kohli) .

విచిత్రం ఏమిటంటే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన సెలబ్రెటీగా వ‌రుస‌గా ఐదో సంవ‌త్స‌రం చార్టుట్లో అగ్ర భాగాన నిలిచాడు. ఈ విష‌యాన్ని డ‌ఫ్ అండ్ షెల్ఫ్ విడుద‌ల చేసిన సెల‌బ్రెటీ బ్రాండ్ వాల్యూయేష‌న్ నివేదిక‌లో వెల్ల‌డించింది.

రెండో స్థానంలో రూ. 158.3 మిలియ‌న్ల‌తో న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ (Ranveer Singh) నిలిచాడు. అక్ష‌య్ కుమార్ రూ. 139.6 మిలియ‌న్ల బ్రాండ్ వాల్యూతో మూడో స్థానంతో స‌రి పెట్టుకున్నాడు. ఇక అత్యంత విలువైన మ‌హిళా సెల‌బ్రెటీగా న‌టి ఆలియా భ‌ట్ (Alia Bhatt) నిలిచింది.

ఇక అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన త‌ర్వాత కూడా మ‌హేంద్ర సింగ్ ధోనీ 25 బ్రాండ్ ల‌తో రూ. 61.2 మిలియ‌న్ల‌కు చేరుకున్నాడు. టాప్ -5 క్ల‌బ్ లో ఐదో ర్యాంకు సాధించాడు.

ఇక టాప్ టెన్ లో అమితాబ్ బ‌చ్చ‌న్ , దీపికా ప‌దుకొనే, స‌ల్మాన్ ఖాన్ , ఆయుష్మాన్ ఖురానా, హృతిక్ రోష‌న్ ఉన్నారు. ఇదిలా ఉండ‌గా విరాట్ కోహ్లీ (Virat Kohli) 30కి పైగా బ్రాండ్ ల‌తో ప‌ని చేస్తున్నాడు.

సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ 2021లో 60 శాతానికి పెరిగింది. 256 మిలియ‌న్ల మంది ఫాలోయ‌ర్లు ఉన్నారు. ఇక 2021 లో టాప్ 20 సెల‌బ్రిటీల మొత్తం బ్రాండ్ వాల్యూ రూ 1.2 బిలియ‌న్లుగా అంచ‌నా వేసింది.

గ‌త ఏడాది కంటే ఈసారి 12.9 శాతం పెరిగింది. టెండూల్క‌ర్ 11వ ర్యాంకులో ఉండ‌గా రోహిత్ శ‌ర్మ 13వ ప్లేస్ లో పీవీ సింధు 20లో ఉన్నారు.

Also Read : స‌మ ఉజ్జీల పోరులో గెలిచేది ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!