Kolkata Doctor Case : ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..
Kolkata Doctor Case : ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కాలేజీలో ఆర్థిక అవకతవకల అభియోగాలకు సంబంధించి తనపై సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన భారత సర్వోన్నత న్యాయస్థానం సందీప్ ఘోష్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఆర్ జీ కర్ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై దర్యాప్తును పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించింది. అయితే సందీప్ ఘోష్ ఆర్థిక అక్రమాలపై ఈడీ దర్యాప్తు కోరుతూ ఆసుపత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తునకు అంగీకరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు(Supreme Court)లో సందీప్ ఘోష్ సవాల్ చేయగా ఆయనకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Kolkata Doctor Case Update
ఆర్థిక అవకతవకల కేసులో ఆర్ జీ కర్ వైద్య కళాశాల(R G Kar Medical College) మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం (సెప్టెంబర్ 2) రాత్రి అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టగా 8 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సందీప్ ఘోష్‌తో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు నిందితులను సీబీఐ విచారిస్తోంది. సీబీఐ దర్యాప్తును సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పటికీ ఉపశమనం దక్కలేదు. మరోవైపు ఈకేసు విచారణకు సంబంధించి బీజేపీ, టీఎంసీ మధ్య రాజకీయ విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. సీబీఐ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కేసును పక్కదారి పట్టించడానికి, నిందితులను కాపాడేందుకు తృణమూల్ కాంగ్రెస్ సీబీఐని ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
Also Read : Tamilisai BJP : తమిళనాడు సీఎం స్టాలిన్ పై ఘాటు విమర్శలు చేసిన బీజేపీ నేత తమిళిసై