Kolkata Doctor Case : కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో సిబిఐ విచారణ మలుపు తిప్పిన మాజీ ప్రిన్సిపాల్
ఆ తర్వాత ప్రిన్సిపాల్‌తో పాటు పలువురు సెమినార్ హాలులోకి వెళ్లారు...
Kolkata Doctor Case : కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోల్‌కతా(Kolkata) కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది. దీంతో విచారణను వేగవంతం చేసేందుకు సీబీఐ అడుగులు వేస్తోంది. అత్యారారానికి ముందు ఏం జరిగింది.. తరువాత ఏం జరిగిందనే విషయానికి సంబంధించిన సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో కళాశాల మాజీ ప్రినిపాల్ సందీప్‌ఘోష్‌ను సీబీఐ విచారిస్తోంది. అయినప్పటికీ ఆయన నోరు విప్పడం లేదని సమాచారం. సెమినార్ గదిలో జూనియర్ డాక్టర్ మృతదేహం ఉందనే విషయం ఆర్ జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌కు ఆగష్టు9 ఉదయం 7గంటలకు తెలిసింది.
ఆ తర్వాత ప్రిన్సిపాల్‌తో పాటు పలువురు సెమినార్ హాలులోకి వెళ్లారు. ఘటన తర్వాత అప్పటి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తోటి సిబ్బంది, ఆసుపత్రి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అసలు ఆరోజు ఏం జరిగిందనే విషయాలు తెలుసుకోవడానికి సందీప్ ఘోష్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. .ఈ కేసుకు సంబంధించి గత 4 రోజులుగా విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ ఘటనలో సందీప్ ఘోష్ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనను మొదట ఆత్మహత్యగా ప్రకటించడంపై సీబీఐ అధికారులు పదే పదే ప్రశ్నించినా ఆయన మాత్రం నోరు విప్పడం లేదట.
Kolkata Doctor Case Update
అభయ మరణ వార్త తెలుసుకున్న తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడంపై మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ఘోష్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వాడానికి ముందు ఆయన సిబ్బందితో సమావేశం నిర్వహిచాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సీబీఐ అధికారులు సందీప్‌ఘోష్‌ను ప్రశ్నించినా ఎలాంటి సమాధానం ఇవ్వలేనట్లు తెలుస్తోంది. అభయ మరణవార్త తెలుసుకున్న తరువాత ఎవరెవరిని సంప్రదించారు.. మృతురాలి తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా మూడు గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించారనే దానిపై అడిగినా ఎలాంటి సమాధానం చెప్పలేదట. సెమినార్ గదికి సమీపంలో గదులకు మరమ్మతులు ఎందుకు చేయించాల్సి వచ్చిందని అడిగినా నోరు మెదపకపోవడంతో సీబీఐ అధికారులు తమ విచారణ స్టైల్ మార్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సందీప్ ఘోష్ కాల్ లిస్ట్‌ను పరిశీలిస్తున్నారట. కేసుకు సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు సేకరించే పనిలో సీబీఐ అధికారులు నిమగ్నమయ్యారు. అవసరమైతే ఈకేసుకు సంబంధించి మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈకేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోల్‌కతా(Kolkata) కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. అయితే పాలిగ్రాఫ్ పరీక్షకు సీబీఐ ఇంకా తేదీని నిర్ణయించలేదు.
Also Read : Minister Ponnam : రుణమాఫీపై రైతన్నలు బేజారు కావొద్దు…