Kolkata Doctor Case : ఆర్జీ కర్ హాస్పిటల్ లో డాక్టర్ హత్య కేసులో నేటి తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

కోలకతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది...

Kolkata Doctor Case : కోలకతా ఆర్జీకార్‌ మెడికల్‌ కాలేజీలో పీజీ డాక్టర్‌ పై అత్యాచారం ఆపై హత్య కేసుకు సంబంధించి సిల్దా సివిల్‌ అండ్‌ క్రిమినల్‌ కోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వబోతుంది. గతేడాది ఆగస్ట్‌9న ఆర్జీకర్ ఆసుపత్రి(R.G. Kar Hospital)లో మహిళా డాక్టర్ పై హత్యాచారం ఘటన జరిగింది. నవంబర్‌ 12నుంచి సిల్దా కోర్టు విచారణ చేపట్టింది. 50 మంది సాక్ష్యాలను పరిశీలించింది. ఈ నెల 9న తుది విచారణ పూర్తయింది. రెండు నెలల పాటు విచారణ జరిపిన సిల్దా కోర్టు శనివారం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Kolkata Doctor Case Updates

కోలకతా(Kolkata) హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది. నిందితుడు సంజయ్‌రాయ్‌కు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించడం సహా ఆర్జీకార్‌ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ ఘోష్‌తో పాటు పలువుర్ని సీబీఐ ప్రశ్నించింది. అయితే.. ఈ ఘటనకు నిరసనగా ఆర్జీకార్‌ హాస్పిటల్‌లో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై దాడి ఘటన సంచలనం రేపింది. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్‌ సర్కార్‌ను కోలకతా హైకోర్టు తీవ్రంగా మందలించింది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆ క్రమంలోనే ర్యాలీ నిర్వహించారు సీఎం మమతా బెనర్జీ. హత్యాచారం కేసులో నిందితులను ఉరితీయాలన్నారు. కొందరు నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఇకకోలకతాలో డాక్టర్‌పై హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై నిపుణులతో నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. సంచలనం రేపిన డాక్టర్‌ హత్యాచారం కేసులో నివేదిక ఇచ్చిన సీబీఐ.. నిందితుడికి మరణ శిక్ష విధించాలని సిఫార్సు చేసింది. సీబీఐ సిఫార్సు చేసినట్టుగా నిందితుడు సంజయ్‌ రాయ్‌కు మరణ శిక్ష ఖాయమా? మరికొందరి ప్రమేయం కూడా వుందన్న డాక్టర్‌ అభయ పేరెంట్స్‌ ఫిర్యాదు కీలకంగా మారనుందా? హత్యాచారం కేసు సహా ఆర్జీకార్‌లో అక్రమాలపై కూడా సిల్దా కోర్టు సంచలన తీర్పు ఇవ్వనుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. హత్యాచారం కేసులో మరికొందరి ప్రమేయం ఉందని పేర్కొంటున్న డాక్టర్‌ అభయ పేరెంట్స్.. ..నిజం తేల్చి..వాళ్లందరికి శిక్ష వేయాలంటున్నారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. వాళ్లతో పాటు యావత్‌ దేశం సిల్దా కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందని ఆసక్తి ఎదురుచూస్తున్నారు.

Also Read : BRS vs Congress : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామా పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!