Kolkata Doctor Case : పాలిగ్రాఫ్ టెస్టులో తప్పించుకునే సమాధానమిస్తున్న మాజీ ప్రిన్సిపల్

కాగా, సందీప్ ఘోష్‌తో పాటు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజిత్ మండల్‌ను కూడా సీబీఐ ఇటీవల అరెస్టు చేసింది...

Kolkata Doctor : సంచలనం సృష్టించిన ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ‘ఆర్థిక అవకతవకల’ కోణం నుంచి కూడా సీబీఐ(CBI) విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ పై పాలిగ్రాఫ్ టెస్ట్, వాయిస్ ఎనాలిసిస్ జరుపగా, ఆయన మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 9వ తేదీని ఆర్జీ కర్ ఆసుపత్రి సెమినార్ హాలులో అత్యాచారం, హత్యకు గురైన ట్రయినీ వైద్యురాలి ఘటన సంచలనం సృష్టించడంతో సీబీఐకి కేసు అప్పగించారు. హత్యాచార ఘటనపై ఉదయం 9.59 గంటలకు సందీప్ ఘోష్‌కు సమాచారం అందిందని, కానీ వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సీబీఐ చెబుతోంది. సాక్ష్యాలను తారుమారు చేశారనే అభియోగంపై ఆయనను ఈనెల 2న అరెస్టు చేసి పాలిగ్రాఫ్, వాయిస్ ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ రెండు పరీక్షల్లో ఆయన మోసపూరిత సమాధానాలు ఇచ్చారని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక ఇచ్చినట్టు సీబీఐ అధికారులు తాజాగా తెలిపారు.

Kolkata Doctor Case Updates

కాగా, సందీప్ ఘోష్‌తో పాటు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజిత్ మండల్‌ను కూడా సీబీఐ ఇటీవల అరెస్టు చేసింది. ఆగస్టు 9వ తేదీ ఉదయం 9.58 గంటలకు సందీప్ ఘోష్‌కు సమాచారం అందగా, 10.03 గంటలకు ఆయన మండల్‌తో మాట్లాడాడని, 11.30 గంటలకు అసహజ మరణంగా కేసు రిజిస్టర్ అయిందని సీబీఐ తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి మండల్ చేరుకోలేదని కూడా సీబీఐ ఆరోపణగా ఉంది.

Also Read : Elon Musk : ట్రంప్ పై హత్యాయత్నం ఘటనపై స్పందించిన టెస్లా అధినేత

Leave A Reply

Your Email Id will not be published!