Komatireddy Venkatreddy : ప్రచారానికి కోమటిరెడ్డి దూరం
ఆస్ట్రేలియాకు ప్రయాణం
Komatireddy Venkatreddy : కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. పార్టీ పరంగా స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరం కానున్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ప్రస్తుతం మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే హైకమాండ్ సూచనల మేరకు టీపీసీసీ డిక్లేర్ చేసింది. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది.
మిగతా పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఈ ముగ్గురి అభ్యర్థుల మధ్యే ఉండనుంది. దీంతో ఇప్పటికే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి పట్టుంది. కాగా ఉన్నట్టుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy) తాను ప్రచారానికి దూరంగా ఉండనున్నట్లు సమాచారం.
తన ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు టాక్. ఈనెల 15న వెళ్లేందుకు ప్లాన్ కూడా చేసుకున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక తర్వాతే తిరిగి హైదరాబాద్ కు వస్తారని సన్నిహితులు పేర్కొంటున్నారు.
ఇక పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ కీలకమైన ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ తరపున ప్రచారం చేస్తారని చెబుతూ వచ్చారు. తీరా ఉప ఎన్నిక నోటిఫికేషన్ డిక్లేర్ కావడంతో ఉన్నట్టుండి వెంకట్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు.
Also Read : నెట్టింట్లో టెమ్ జెన్ ఇమ్నా వైరల్