Kota Srinivasa Rao : ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతిపై..ప్రముఖుల సంతాపం

ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి...

Kota Srinivasa Rao : తెలుగు సినీ రంగాన్ని నాలుగు దశాబ్దాలకు పైగా తన హావభావాలతో అలరించిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (వయస్సు 83) ఇకలేరు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన, ఈరోజు ఉదయం (జూలై 13, ఆదివారం) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Senior Actor Kota Srinivasa Rao No More

కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) గారు విలన్, పాత్రధారి, హాస్య నటుడిగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన నటనకు ప్రత్యేక శైలి ఉండేది. ప్రతి పాత్రలో తనదైన ముద్ర వేసేవారు. సినిమాలకే కాకుండా నాటక రంగానికీ ఆయన విశేష సేవలు అందించారు.

కోట గారి మృతిపై పలువురు ప్రముఖులు తమ శోకాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రీవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీనటుడు పవన్ కల్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ తదితరులు ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోట శ్రీనివాసరావు, రాజకీయాల్లోనూ తన ముద్ర వేసారు. అలాగే, 2015లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసింది.

750కి పైగా చిత్రాల్లో నటించిన కోట గారి మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటుగా నిలిచింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చిత్ర పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Also Read : PM Kisan : ఆ రైతులకు పీఎం కిసాన్ బందంటున్న కేంద్ర సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!