Kothapalli Subbarayudu: జనసేనలో చేరిన మాజీ మంత్రి !
జనసేనలో చేరిన మాజీ మంత్రి !
Kothapalli Subbarayudu: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు సోమవారం జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో హైదరాబాద్ లో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్… సుబ్బారాయుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని అతనికి సూచించారు. కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapalli Subbarayudu) చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు కొత్త ఉత్సాహం వస్తుందని, ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన కొత్తపల్లి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి కీలక పాత్ర పోషించారు. అనంతరం వైసీపీలో చేరిన కొత్తపల్లి… సరైన ప్రాధాన్యత లేకపోవడంతో కొన్ని నెలల క్రితం పార్టీకు రాజీనామా చేసారు. తాజాగా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Kothapalli Subbarayudu – టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ‘జెండా’ గా నామకరణం !
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేసాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఈ సభలో తమ ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకు ‘జెండా’ గా నామకరణం చేసాయి. ఈ సభా వేదిక పనులను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ సహా పలువురు టీడీపీ నాయకులు పరిశీలించారు. అనంతరం బహిరంగ సభ వద్ద ‘జెండా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Also Read : Congress First Guarantee: ఏపీలో మొదటి గ్యారెంటీని ప్రకటించిన కాంగ్రెస్ !