#Kothari : భారతీయ విద్యావ్యవస్థ బలిష్ఠతకు కృషి చేసిన కొఠారి
Kothari who worked for the strength of the Indian education system
Kothari : దౌలత్ సింగ్ కొఠారి గారు జూలై 6, 1906 రోజున రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జన్మించి, ఫిబ్రవరి 4, 1993 రోజున మరణించారు.భారతీయ విద్యావ్యవస్థకు ఎన్నో మార్గదర్శకాలను సూచించి, భారతీయ విద్యా కమిషన్ ను ఆయన పేరుమీద “కొఠారి కమిషన్” గా గుర్తింపు తెచ్చుకున్న గొప్ప భారతీయ శాస్త్రవేత్త మరియు విద్యావేత్త.నేడు వారి వర్దంతి సందర్భంగా మరోమారు స్మరించుకుందాం.
ప్రాథమిక విద్యను ఉదయపూర్, ఇండోర్ నగరాలలో పూర్తి చేసి, 1928 లో అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రం విభాగంలో మాస్టర్స్ డిగ్రీని పొంది, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కావెండిష్ ప్రయోగశాలలో పి హెచ్ డి పట్టపొందాడు.ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా, ఫిజిక్స్ విభాగాధిపతిగా, 1948 నుండి 1961 వరకు రక్షణ మంత్రిత్వ శాఖకు శాస్త్రీయ సలహాదారుగా,1961 నుంచి 1973 వరకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్గా పనిచేశాడు.గణాంక థర్మోడైనమిక్స్, థియరీ ఆఫ్ వైట్ డ్వార్ఫ్ స్టార్స్ పై ఆయన చేసిన పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకొని, 1962 లో పద్మ భూషణ్, 1973 లో పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన గొప్ప విద్యావేత్త కొఠారి(Kothari ).
స్వాతంత్ర్యం తరువాత, భారత ప్రభుత్వం విద్యపై ఒక కమిషన్ను నియమించింది. కమిషన్ చైర్మన్ గా ప్రొఫెసర్ దౌలత్ సింగ్ కొఠారి, విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ చైర్మన్ గారిని నియమించింది . ఈ కమిషన్ యొక్క అసలు పేరు “భారతీయ విద్యా కమిషన్@, అయితే ఇది దాని ఛైర్మన్ పేరు ద్వారా “కొఠారి కమిషన్” గా ప్రసిద్ది చెందింది.
ఈ కమిషన్ అమెరికా, బ్రిటన్, రష్యా, యునెస్కో నిపుణుల సలహాలు మరియు సూచనల స్వీకరించింది.ఈ కమిషన్ సూచించిన అభిప్రాయాలను మన ప్రభుత్వం చాలా వరకు అమలు చేసింది.మరికొన్ని సవరణలు అమలు చేయలేదు.కొఠారి కమిషన్ నియామకం యొక్క ఉద్దేశ్యం లేదా లక్ష్యాలు లను కొఠారి కమిషన్ యొక్క ప్రధాన సిఫార్సులు 1964-66,విద్య యొక్క జాతీయ లక్ష్యాలు గా ప్రసిద్ధి చెందాయి. కొఠారి కమిషన్ 14.07.1964 న ఏర్పడి వివిధ అంశాలను పరిశీలించి సిఫారసులను చేసింది.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, అక్షరాస్యత పెంచేందుకు రాజ్యాంగంలోని 45వ అధికరణ ప్రకారం 6-14 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు ఉచిత, తప్పనిసరి విద్యను అందించాలని, దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం ఉండాలని వెనకబడిన, గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచింది.
అలాగే సైన్స్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, సైన్స్ విద్య విద్యలో అంతర్భాగంగా ఉండాలని మరియు అది ప్రాధమిక దశ నుండే ప్రారంభం కావాలని మరియు విశ్వవిద్యాలయ దశలో అన్ని కోర్సులలో భాగంగా ఉండాలని సూచించింది..
సామాజిక మరియు జాతీయ సేవ అన్ని దశలలో విద్యలో అంతర్భాగంగా ఉండాలని , పని-అనుభవానికి ప్రాముఖ్యత ఉండాలని,ప్రాంతీయ భాషలు విద్య యొక్క అన్ని దశలలో విద్యా మాధ్యమంగా ఉండాలని కమిషన్ సిఫారసు చేసింది.
సెకండరీ స్కూల్ రెండు రకాలుగా ఉండాలని హై స్కూల్ పది సంవత్సరాల కోర్సును , మరియు హయ్యర్ సెకండరీ స్కూల్ 11 మరియు 12 సంవత్సరాల కోర్సును అందిబిచాలని, మొదటి తరగతికి ప్రవేశించే వయస్సు 4 ఏళ్లలోపు ఉండకూడదని,తొమ్మిదో తరగతి నుండి సాధారణ విద్య పాఠశాలలో స్ట్రీమింగ్ వ్యవస్థను వదిలివేయాలని మరియు పదవ తరగతి దాటినంత వరకు స్పెషలైజేషన్ కోసం ఎటువంటి ప్రయత్నం చేయకూడదని సూచించింది.విద్యా నిర్మాణంపై కొఠారి కమిషన్ సిఫార్సు10 + 2 + 3 నమూనాగా ప్రసిద్ది చెందిన జాతీయ విద్యా విధానాన్ని కమిషన్ సిఫార్సు చేసింది.
వికలాంగ పిల్లలు మరియు వెనుకబడిన తరగతుల పిల్లలకు విద్యా రంగంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని,
వయోజన విద్యను ప్రోత్సహించడానికి తగిన సౌకర్యాలు అందుబాటులో ఉండాలని సూచించింది.
పాఠశాల విద్య మాతృభాషలోనే సాగుతున్నందున విశ్వవిద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంతో సామాన్యులు, మేధావుల మధ్య అంతరం పెరుగుతోంది. దీనిని తగ్గించేందుకు ఉన్నత విద్య కూడా మాతృభాషలో సాగాలని, అన్ని రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని పాటించాలని సూచిస్తూ ప్రాథమిక పాఠశాలలో మాతృభాష ఉన్నందున,ఉన్నత విద్య స్థాయిలో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీ, ఆంగ్లంతోపాటు మరో భాషను బోధించాలని సిఫారసు చేసింది.
విద్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాల సమన్వయం కీలకం. రెండు వ్యవస్థలు కలిసిపనిచేయాలని సూచించింది.కొఠారీ కమిషన్ చేసిన సిఫార్సుల్లోనే అనేక అంశాలను 1986లో నియమించిన నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్(ఎన్పీఈ) కమిటీ (Kothari )కూడా చేసింది. కానీ, ఆ సిఫార్సులు అన్ని అమలుకాలేదు.ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానాలు ఎక్కువగా కొఠారి కమిషన్ సూచించినవి అయినందున మరో మారు నూతన జాతీయ విద్యా విధానం 2020 ద్వారా మార్పులకు,చేర్పులకు అవకాశం కల్పించారు.
No comment allowed please