Kraigg Brathwaite : విండీస్ స్కిప్ప‌ర్ అరుదైన ఘ‌న‌త

దిగ్గ‌జాల స‌ర‌స‌న క్రెయిగ్ బ్రాత్ వైట్

Kraigg Brathwaite  : ప్ర‌పంచ క్రికెట్ లో ఒక్కోసారి ఒక్కో క్రికెట‌ర్ వెలుగులోకి వ‌స్తాడు. గ‌త కొంత కాలంగా క్రికెట్ లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక‌ప్పుడు టెస్టు క్రికెట్ కు ప్ర‌యారిటీ ఉండేది.

ఎప్పుడైతే వ‌న్డే, టీ20 ఫార్మాట్ లు వ‌చ్చాయో ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువ క్రికెట‌ర్లకు అవకాశాలు వ‌స్తున్నాయి. గ‌తంలో ఇంగ్లండ్ లో క్రికెట్ కౌంటీ నిర్వ‌హించారు.

కానీ భార‌త్ లో జ‌గ‌న్మోహ‌న్ దాల్మియా ఎంట‌ర్ అయ్యాడో ఆనాటి నుంచి క్రికెట్ కు ఎన‌లేని ఆద‌ర‌ణ తీసుకు వ‌చ్చేలా చేశాడు. ఐపీఎల్ కూడా వ‌చ్చేసింది. రాను రాను టెస్టు క్రికెట్ మూడు రోజుల లోపే ముగుస్తోంది.

ఈ త‌రుణంలో వెస్టిండీస్ జ‌ట్టు అన్ని ఫార్మాట్ ల‌లో ఇటీవ‌ల రాణిస్తోంది. ఆ జ‌ట్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్(Kraigg Brathwaite )అద్భుతంగా రాణించాడు. 700 నిమిషాల మార‌థాన్ ఇన్నింగ్స్ ఆడాడు.

సార‌థ్యం వ‌హిస్తున్న వైట్ ఆడ‌డ‌మే కాదు జ‌ట్టును ముందుండి న‌డిపించ‌డం విశేషం. త‌న స‌త్తా ఏమిటో మ‌రోసారి చూపించాడు. తాజాగా ఇంగ్లండ్ జ‌ట్టుతో జ‌రుగుతున్న మ్యాచ్ లో చుక్క‌లు చూపించాడు.

రాను రాను సంప్ర‌దాయ క్రికెట్ పై మోజు త‌గ్గుతున్న వేళ క‌ళాత్మ‌క ఆట‌తో ఆక‌ట్టుకున్నాడు. ఏకంగా 12 గంట‌ల‌కు పైగా క్రీజులో ఉన్నాడు. 489 బంతులు ఆడి 17 ఫోర్ల‌తో 160 ర‌న్స్ చేశాడు.

ఈ ఒక్క ఇన్నింగ్స్ తో విండీస్ దిగ్గ‌జాల స‌ర‌స‌న చేరాడు. బ్రియాన్ లారా, శ‌ర్వాన, వోరెల్ ఉన్నారు. వీరితో పాటు వైట్ చేరాడు.

Also Read : శ్రీ‌లంక‌లో ఆసియా క‌ప్ టోర్నీ

Leave A Reply

Your Email Id will not be published!