Krunal Pandya : ఐపీఎల్ 2022 రిచ్ మెగా లీగ్ లో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కళ్లు చెదిరేలా క్యాచ్ లు పట్టడం, విస్తు పోయేలా సిక్సర్లు కొట్టడం, ఊహించని రీతిలో రనౌట్స్ చేయడం ఇవన్నీ ఇప్పుడు సహజమై పోయాయి ఐపీఎల్ లో.
ఇక ఐపీఎల్ కు ఈసారి బీసీసీఐ ప్రేక్షకులను పరిమిత సంఖ్యలో పర్మిషన్ ఇచ్చింది. దీంతో అమ్మాయిలు, అందగత్తెలు, ముద్దుగుమ్మలు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
ఐపీఎల్ లో కెమెరాలన్నీ ఆటగాళ్లతో పాటు అమ్మాయిల మోము, నవ్వులపైనే ఫోకస్ పెడుతున్నాయి. తాజాగా లీగ్ మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబై ఇండియన్స్ తలపడింది.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 168 రన్స్ చేసింది. ఆ తర్వాత టార్గెట్ ఛేదనలో 132 పరుగులే చేసి చాప చుట్టేసింది ముంబై ఇండియన్స్ .
ఇక 2010 నుంచి ఐపీఎల్ తో బంధం కొనసాగిస్తూ వస్తున్నాడు స్టార్ విండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్(Krunal Pandya). ఇదే సమయంలో తాజాగా తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ప్రస్తుతం ముంబై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా కృనాల్ పాండ్యా వేసిన బంతికి పొలార్డ్ అవుటయ్యాడు. సంతోషం పట్టలేక పాండ్యా పొలార్డ్ ను అదిమి పట్టుకున్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ లో ఇది హల్ చల్ గా మారింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏది ఏమైనా ఆటలో ఇవన్నీ మామూలేగా. ఇదిలా ఉండగా పొలార్డ్ 19 పరుగులు చేసి వెనుదిరిగాడు.
Also Read : జాన్సెన్ పై లారా ప్రశంసల జల్లు