KT Rama Rao : బీజేపీలో మీ వారసుల చిట్టా విప్పండి

మోదీ..అమిత్ షాకు కేటీఆర్ స‌వాల్

KT Rama Rao : భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు ప‌దే ప‌దే వార‌స‌త్వ రాజ‌కీయాల గురించి మాట్లాడుతున్నారు. ప్ర‌ధానంగా ప్ర‌ధాని మోదీ(PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. మ‌రి ఇత‌రుల‌ను, పార్టీల‌ను విమ‌ర్శించే కంటే ముందు మీ సంగ‌తి ఏంటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు.

ఒక‌రికి చెప్పేందుకు మాత్ర‌మే నీతులు ప‌నికి వ‌స్తాయ‌ని త‌మ దాకా వ‌స్తే అవి ప‌ని చేయ‌వంటూ ఎద్దేవా చేశారు. ఒక‌రికి ఒక ప‌ద‌వి మాత్ర‌మే ఉండాల‌ని చెప్పిన బీజేపీ ఆచ‌ర‌ణ‌లో దానికి రివ‌ర్స్ గా వెళుతోంద‌ని మండిప‌డ్డారు. త‌మ వైపు ఒక‌సారి చూసుకుంటే మంచిద‌న్నారు.

దేశంలో అత్యంత ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థగా పేరొందిన బీసీసీఐ లో ఇప్పుడు అమిత్ షా త‌న‌యుడు జే షా క‌నుస‌న్న‌ల‌లో న‌డుస్తోంద‌ని పేర్కొన్నారు. జే షా ఎక్క‌డ ఏ మైదానంలో సెంచ‌రీ చేశాడో చెప్పాల‌న్నారు. ఇక అరుణ్ ధుమాల్ ఇప్పుడు ఐపీఎల్ చైర్మ‌న్ రేసులో ఉన్నార‌ని ఆయ‌న ఎవ‌రో కాదు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) సోద‌రుడ‌ని వెల్ల‌డించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది త‌మ వారుసులు రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నార‌ని కానీ వాటి గురించి ప‌ల్లెత్తు మాట్లాడ‌డం లేద‌న్నారు కేటీఆర్. నియ‌మ నిబంధ‌న‌లు, బోధ‌న‌లు ఇత‌రుల‌కు చెప్పేందుకేనా అవి మీకు వ‌ర్తించ‌వా అంటూ మోదీ, అమిత్ షాను ఏకి పారేశారు.

మీరు మాత్ర‌మే నీతిమంతులు ఇత‌రులు మాత్రం చెడ్డవారుగా క‌నిపిస్తారంటూ ధ్వ‌జ‌మెత్తారు కేటీఆర్(KT Rama Rao). ఇదిలా ఉండగా టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ ట్విట్ట‌ర్ వేదిక ద్వారా బీజేపీ వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై నిప్పులు చెరిగారు. మోదీ డైనాస్ట్స్ క్ల‌బ్ అంటూ బీజేపీ నేత‌లు, వారి వారసుల‌తో కూడిన ఫోటోల‌ను పోస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : ధ‌న బ‌లం ఆత్మ గౌర‌వానికి మ‌ధ్య పోరాటం

Leave A Reply

Your Email Id will not be published!