KTR : పార్టీ ఫిరాయింపుల పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి

ఫిర్యాదు పర్వం ముగిశాక కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు...

KTR : ఫిరాయింపులపై ఫిర్యాదులతో తెలంగాణ రాజకీయం కాక రేపుతోంది. మాంచి వర్షాకాలంలో కూడా వేడి పుట్టిస్తోంది. ఇది పార్టీని కాపాడుకునే టైమ్‌.. కంప్లయింట్‌ టైమ్‌ అంటోంది బీఆర్‌ఎస్‌ పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులకు గులాబీ పార్టీ దండు కట్టింది. చలో రాజ్‌భవన్‌ అంటూ కేటీఆర్‌ నేతృత్వంలో గవర్నర్‌ని కలిశారు నేతలు. గులాబీ గూటి నుంచి కాంగ్రెస్‌లోకి జారిపోతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వేటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు రాజ్‌భవన్‌కు దండు కట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో గవర్నర్ రాధాకృష్ణన్‌తో బీఆర్‌ఎస్‌ నేతలు భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ గవర్నర్‌కు గులాబీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కూడా కంప్లయింట్‌ చేశారు. పార్టీ ఫిరాయింపులపై గతంలోనే స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది.

KTR Comment

ఫిర్యాదు పర్వం ముగిశాక కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్(KTR) విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపైనే దాడులు చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కేటీఆర్‌కు పరిగి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ నేతలు గవర్నర్‎ను కలిసి వినతి పత్రాలు ఇచ్చి రాజకీయం చేస్తున్నారని రామ్మోహన్‌ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిన గులాబీ పార్టీ, ఇప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. గవర్నర్‌కి వినతి పత్రాలు ఇచ్చి హడావుడి చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఫిరాయింపులు, ఫిర్యాదులు, కౌంటర్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.

Also Read : Minister Tummala : పెద్ద వాగు వల్ల నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకుంటాం

Leave A Reply

Your Email Id will not be published!