KTR : వరుస ట్వీట్లతో అధికార పార్టీకి గుబులు పుట్టిస్తున్న కేటీఆర్
భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు...
KTR : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ మంత్రి. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ప్రతీ సమస్యపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు.
KTR Tweet..
తాజాగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితిపై, అదానికి తెలంగాణలో పెట్టుబడులకు అనుమతి ఇవ్వడంపై, అలాగే మహబూబ్‌నగర్ జిల్లా మానుకోటలో బీఆర్‌ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరించడంపై ట్వీట్లు పెడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉందని, సరైన భోజన సౌకర్యంలేక అల్లాడిపోతున్నారన్నారు. విద్యార్థులకు అన్నం పెట్టలేని వారు.. మహిళలను కోటీశ్వరులను చేస్తారట అంటూ ఎద్దేవా చేశారు.తెలంగాణలో విద్యార్థులు, రైతులు, నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్ చేశారు.
‘‘తల్లికిబువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట! విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్- మహిళలను కోటీశ్వరులను చేస్తాడట! రోజుకో గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి విద్యార్థుల అస్వస్థత. ఎన్నడూ లేనిది గురుకుల పాఠశాలలలో ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు మరణం. పిల్లలు పిట్టల్లా రాలుతుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా వేదికల మీదికెక్కి పిట్టలదొర మాటలు చెబుతుండు. దవాఖానల్లో విద్యార్థులు. చెరసాలలో రైతన్నలు. ఆందోళనలో నిరుద్యోగులు. జాగో తెలంగాణ’’ అంటూ కేటీఆర్(KTR) ట్వీట్ చేశారు.‘‘అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.
భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు. అదానితో కాంగ్రెస్ – బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం..అరిష్టం. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో. ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు. తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి. మీరు అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలి. తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత.. మీ అదానీ భాయ్ వాటా ఎంత.. మీ హైకమాండ్ వాటా ఎంత?’’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్(KTR).
అలాగే లగచర్ల బాధితులకు సంఘీభావంగా మహబూబ్‌నగర్ జిల్లా మానుకోటలో బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపైనా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శాంతిభద్రత సమస్య తలెత్తుదుందని పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. దీనిపై కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు – మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి. అక్కడ గొడవలు ఏం జరగలేదు – మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు. అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది. శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది. ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది. ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష్యల పాలన, ఆంక్షల పాలన.. మొత్తంగా రాక్షస పాలన. ఖబర్దార్ రేవంత్. ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది’’అంటూ కేటీఆర్ హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.
Also Read : Minister Nara Lokesh : ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని అన్నదే ఎన్డీయే సర్కార్ లక్ష్యం