MLA KTR : బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్

ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారన్నారు...

KTR : బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ మేరకు గురువారం కేటీఆర్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటీగా “ఎమర్జెన్సీ”ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. నిర్బంధం, అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కే విఫలయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA KTR Comments

రోజు రోజుకూపెరిగిపోతున్న నేరాల నియంత్రణలో పూర్తిగా చేతిలెత్తేసి, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎలా నియంత్రించాలనే దానిపైనే సర్వశక్తులు ఒడ్డుతున్నారన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాని డిమాండ్ చేశారు.తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసే విష సంస్కృతికి చరమగీతం పాడాలని హితవుపలికారు. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని.. అరెస్టులు అంత కన్నా కాదన్నారు. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడే వారెవరూ లేరని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read : CPI Narayana : చిత్ర పరిశ్రమపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!