KTR Meet : కవిత కొత్త పార్టీ పెడుతుందంటూ వస్తున్న వార్తలు.. కెసిఆర్ ను కలిసిన కేటీఆర్
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలవనున్నారు...
KTR : కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తండ్రి కేసీఆర్‌కు ఆమె లేఖ రాయటం.. పార్టీలోని కొంతమందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ‘ కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అని కవిత అనటంతో తీవ్ర దుమారం రేగింది. కవిత లేఖ ఎపిసోడ్ నేపథ్యంలో కేటీఆర్.. కేసీఆర్ దగ్గరకు వెళ్లబోతున్నారు.
KTR Meet KCR
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలవనున్నారు. బీఆర్ఎస్‌లో తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించనున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టనున్నారనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశం సందర్భంగా కాళేశ్వరం నోటీసులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కవిత రాసిన లేఖపై ఆమె అన్న.. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.. ‘పార్టీలో అందరూ సమానమే, కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బావుంటుంది. పార్టీలో రేవంత్ కోవర్టులు ఉంటే ఉండవచ్చు. తమకు తామే ఆ కోవర్టులు బయటపడతారు’ అని అన్నారు.
Also Read : CM Chandrababu : 10వ నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రధానిపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు