KTR: కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర నేతలకు లింకులు – కేటీఆర్‌

కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర నేతలకు లింకులు - కేటీఆర్‌

కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర నేతలకు లింకులు – కేటీఆర్‌

 

కర్ణాటకలో సంచలనం సృష్టించిన వాల్మీకి స్కామ్‌ తో తెలంగాణ రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్‌ నుంచి రూ.45 కోట్లు బదిలీ అయ్యాయని తెలిపారు. ఎంపీ ఎన్నికల వేళ నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణాల నిర్వాహకులెవరని ప్రశ్నించారు. బార్లు, బంగారు దుకాణాల నిర్వాహకులకు కాంగ్రెస్‌తో ఉన్న సంబధం ఏంటని నిలదీశారు.

 

‘‘హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాలకు రూ.45 కోట్లు బదిలీ అయ్యాయి. వాల్మీకి స్కామ్‌కు సంబంధించి రాష్ట్రంలో సిట్‌, సీఐడీ, ఈడీ సోదాలు జరిగాయి. దర్యాప్తు సంస్థల సోదాల వార్తలు బయటకు రాకుండా అణచివేశారు. రూ.90 కోట్లు అవినీతి జరగిందని కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వమూ కూలుతుందని కర్ణాటక మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి సతీశ్‌ ఎందుకన్నారు? ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంది? తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారు?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Leave A Reply

Your Email Id will not be published!