KTR Slams : భావోద్వేగాలతో ఆడుకోకండి – కేటీఆర్
టీఎస్ పీఎస్సీ లీకుతో నాకేంటి సంబంధం
KTR Paper Leak Issue : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీల వ్యవహారంపై స్పందించారు. శనివారం ప్రగతి భవన్ లో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అవగాహన లేని వాళ్లు మాట్లాడిన ప్రతి దానికి తాను ఎలా సమాధానం ఇస్తానని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు కేటీఆర్.
విచిత్రం ఏమిటంటే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు..ఐటీ శాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇద్దరు చేసిన తప్పు పనికి లక్షలాది మంది నిరుద్యగులు , అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వారికి భరోసా ఇవ్వాల్సింది పోయి రెచ్చ గొడితే ఎలా అని మండిపడ్డారు కేటీఆర్(KTR Paper Leak Issue) .
ఐటీ శాఖ ఏం చేస్తుందో తెలియకుండా ప్రతిపక్షాలు మాట్లాడటం దారుణమన్నారు. వాళ్లకు అంతకు మించి ఇంకేమీ తెలియదన్నారు. ఎంత సేపు రాజకీయ లబ్ది ఎలా పొందాలనే దానిపై రాద్దాంతం చేస్తున్నారే తప్పా ఎలా సమస్య నుంచి గట్టెక్కాలనే దానిపై సూచనలు ఇవ్వడం లేదన్నారు. తప్పు జరిగింది..దానిని సరిదిద్దే ప్రయత్నం తాము చేస్తున్నామని స్పష్టం చేశారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి.
రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్ కు తానే బాధ్యత వహించాలన్న రీతిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటి వరకు మోదీ ఎన్ని జాబ్స్ ఇచ్చారో ప్రజలకు తెలియ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
Also Read : టీఎస్‌పీఎస్సీపై సీఎం సమీక్ష