KTR: పదేళ్ల నిజం బీఆర్ఎస్… వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌ – కేటీఆర్‌

పదేళ్ల నిజం బీఆర్ఎస్... వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌ - కేటీఆర్‌

KTR: పదేళ్ల నిజం బీఆర్ఎస్… వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో రుణమాఫీ లేదు… రైతుబంధు లేదు. అన్నదాతల్లో బాధ మొదలైందని… యువత ఆవేదనతో ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందో తెలియక హైదరాబాద్‌ ప్రజలు ఆలోచనలో పడ్డారని ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి లోక్‌ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్(KTR)… తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

KTR Comment

‘‘డిసెంబర్‌ 9న విడుదల చేస్తామని చెప్పిన రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది ? పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడం లేదు. కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం లేదు. కాంగ్రెస్‌ పై ఆటోడ్రైవర్లు కోపంగా ఉన్నారు. కేసీఆర్‌ ను నోటికొచ్చినట్లు దూషిస్తుంటే బాధగా అనిపిస్తోంది. లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే… అరిచేవారికి సమాధానం కావాలి. ఈ సందర్భంగా మల్కాజిగిరిలో తేల్చుకుందామని రేవంత్‌ కు సవాల్‌ విసురుతున్నాను. ఇద్దరం ఇక్కడి నుంచి పోటీ చేద్దాం… ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. పెద్దపెద్ద డైలాగ్‌ లే తప్పా… రేవంత్‌కు ధైర్యం లేదు. బీజేపీలోకి పోవాలన్నది ఆయన ఆలోచన. కొంత మంది కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతారు.’’ అని కేటీఆర్‌ అన్నారు.

అంతకుముందు చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘‘అధికారం, ఆస్తుల కోసమే రంజిత్‌రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌కు వెళ్లారు. హస్తం పార్టీకి ఈ లోక్‌ సభ నియోజకవర్గంలో కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ తీవ్రమైన అయోమయంలో ఉంది. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవడం అసాధ్యం. చేవెళ్లలో ఏప్రిల్‌ 13న జరిగే సభలో కేసీఆర్‌ పాల్గొంటారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా నిలబడిన వ్యక్తి’’ అని కేటీఆర్‌ అన్నారు.

Also Read: Mayanmar: రూ. 30,000 కోట్లతో మయన్మార్‌ సరిహద్దుల్లో కంచె !

Leave A Reply

Your Email Id will not be published!