Kuldeep Sen : ఎవరీ కుల్దీప్ సేన్ అంటూ ఒక్కసారిగా ఐపీఎల్ లోని ఇతర మ్యాచ్ లకు సంబంధించిన ఆటగాళ్లు , ఫ్రాంచైజీలు, ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే వచ్చీ రావడంతోనే తనదైన ముద్ర కనబర్చాడు ఈ ఆటగాడు.
గత ఫిబ్రవరి నెలలో బెంగళూరు వేదికగా జరిగిన మెగా ఐపీఎల్ వేలంలో ఏరికోరి ఈ బౌలర్ ను ఎంచుకుంది
రాజస్థాన్ రాయల్స్ మేనేజ్ మెంట్. ఇందులో ప్రధాన పాత్ర ఆ జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కరదేనని చెప్పక తప్పదు.
లసిత్ మళింగ రాజస్థాన్ కు బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు. ఇక కుల్దీప్ సేన్ (Kuldeep Sen ) విషయానికి వస్తే ముంబై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్
తో కీలకమైన లీగ్ మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ చివరి బంతి వరకు పోరాడింది.
ఒక రకంగా చెప్పాలంటే నరాలు తెగే ఉత్కంఠకు తెర తీసింది ఈ మ్యాచ్. మ్యాచ్ రసవత్తరంగా సాగింది.
నువ్వా నేనా అన్న రీతిలో ఇరు జట్ల మధ్య పోటీ నెలకొంది. అప్పటి వరకు యజ్వేంద్ర చహల్ 4 వికెట్లు తీశాడు.
అశ్విన్ కోటా అయి పోయింది. దీంతో ఉన్నది బౌలర్ కుల్దీప్ సేన్ ఒక్కడే.
మూడు ఓవర్లు ముగిశాయి. కొత్త బౌలర్. అప్పటికే ఒక వికెట్ తీశాడు.
ఏ మాత్రం అజాగ్రత్త వహించినా మ్యాచ్ కోల్పోవడమే. కానీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కుల్దీప్ సేన్ పై నమ్మకం ఉంచాడు.
తనపై స్కిప్పర్ పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఆఖరు 20వ ఓవర్ లో 19 పరుగులు చేయాల్సి ఉండగా మొదటి బాల్ సింగిల్ ఇచ్చాడు. రెండు బంతులకు పరుగులు ఇవ్వలేదు.
ఇక గెలవాలంటే 2 బంతులు 10 పరుగులు చేయాలి. ఈ తరుణంలో స్టోయినిస్ సిక్స్ కొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయం ఇద్దరిది ఒకరు బ్యాటింగ్ పరంగా చెలరేగి ఆడిన హెట్ మైర్ అయితే ఇంకొకరు కుల్దీప్ సేన్ . మొత్తంగా మనోడు తన బౌలింగ్ తో మెస్మరైజ్ చేశాడు. సత్తా చాటాడు.
Also Read : ప్రియమైన తమిళం ఉనికికి మూలం