Kumar Sangakkara : ఎప్ప‌టికీ స‌రైన జోడి ద్ర‌విడ్ ఒక్క‌డే

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కోచ్ సంగ‌క్క‌ర‌

Kumar Sangakkara : శ్రీ‌లంక మాజీ క్రికెట్ దిగ్గ‌జం, ప్ర‌స్తుత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ డైరెక్ట‌ర్, హెడ్ కోచ్ కుమార సంగ‌క్క‌ర(Kumar Sangakkara) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క్వ‌చ్ఛ‌న్ సెష‌న్ లో భాగంగా రాజ‌స్తాన్ బౌలింగ్ కోచ్ మాజీ శ్రీ‌లంక బౌల‌ర్ ల‌సిత్ మ‌ళింగతో క‌లిసి పాల్గొన్నాడు సంగ‌క్క‌ర‌.

ఈ సంద‌ర్భంగా భార‌త క్రికెట్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్ర‌విడ్ ను ఆకాశానికి ఎత్తేశాడు. త‌న జీవిత కాలంలో త‌న‌కు స‌రైన క్రికెట‌ర్ జోడీ ఎవ‌రంటే ది వాల్ ను పేర్కొంటాన‌ని స్ప‌ష్టం చేశాడు సంగ‌క్క‌ర‌.

మోస్ట్ ఫెవ‌ర‌బుల్, వాల్యూబుల్ క్రికెట‌ర్ గా అభివ‌ర్ణించాడు. చాలా కూల్ గా త‌న ఆట‌ను తాను ఆడే ద్ర‌విడ్ తో తాను ఎల్ల‌ప్ప‌టికీ బ్యాటింగ్ చేయాల‌ని అనుకుంటాన‌ని చెప్పాడు.

అత‌డే త‌న‌కు స‌రైన జోడి అంటూ స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం కుమార సంగ‌క్క‌ర‌, ల‌సిత్ మ‌ళింగ ఇద్ద‌రి వీడియో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యాజ‌మాన్యం విడుద‌ల చేసింది.

ప్ర‌స్తుతం ఇది నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంది. భార‌త క్రికెట్ జ‌ట్టులో ఎంద‌రో లెజెండ్స్ ఉన్నార‌ని కానీ త‌న‌కు ద్రవిడ్ తో స‌రి పోతుంద‌న్నాడు.

ఆ పాత్ర‌లో అత‌ను ఇట్టే ఒదిగి పోతాడ‌ని, గోడ‌లా అలాగే క్రీజులో ఉండ‌డం అత‌డి త‌ర్వాతే ఎవ‌రైనా అని కితాబు ఇచ్చాడు కుమార(Kumar Sangakkara). ది వాల్ ఆ పేరుకు త‌నే సార్థ‌క‌త చేకూర్చాడ‌ని తెలిపాడు.

ఇదిలా ఉండ‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఈసారి ప్లే ఆఫ్స్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది. ఆ జ‌ట్టు అన్ని రంగాల‌లో రాణిస్తోంది. హెడ్ కోచ్ గా సంగ‌క్క‌ర ఉండ‌గా బౌలింగ్ కోచ్ గా ల‌సిత్ మ‌ళింగ ఉన్నాడు.

శుక్ర‌వారం ఆఖ‌రి మ్యాచ్ చెన్నై సూప‌ర్ కింగ్స్ తో ఆడ‌నుంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ఇప్ప‌టికే గుజ‌రాత్, ల‌క్నో ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి.

Also Read : గుజ‌రాత్ బెంగ‌ళూరు బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!