Kumar Sangakkara : వెల్ డన్ బాయ్స్ – సంగక్కర
రాజస్థాన్ టీంకు దిశా నిర్దేశం
Kumar Sangakkara : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో తొలి మ్యాచ్ లోనే దుమ్ము రేపింది కేరళ స్థార్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 203 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) 8 వికెట్లు కోల్పోయి 131 రన్స్ కే చాప చుట్టేసింది. భారీ తేడాతో ఓటమి మూటగట్టుకుంది.
సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల దెబ్బకు విల విల లాడింది. ఏ కోశాన ఎదుర్కోలేక పోయింది ఎస్ఆర్ హెచ్. ఇదిలా ఉండగా రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ఐపీఎల్ లో 17 సార్లు తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ 9 సార్లు గెలుపొందితే హైదరాబాద్ 8 మ్యాచ్ లలో విజయం నమోదు చేసింది.
జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జైశ్వాల్ తానేమీ తక్కువ కాదనట్టు రెచ్చి పోయాడు. అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ లీగ్ మ్యాచ్ ఆద్యంతమూ ఉత్కంఠను రేపింది. ఆ ఇద్దరితో పాటు అత్యంత బాధ్యతాయుతంగా అద్భుతమైన ఇన్నింగ్స్ తో చెల రేగాడు కెప్టెన్ సంజూ శాంసన్. కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్ 55 రన్స్ తో రెచ్చి పోయాడు.
మ్యాచ్ గెలుపొందిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో టీమ్ హెడ్ కోచ్ కుమార సంగక్కర దిశా నిర్దేశం చేశాడు. అందరూ అద్భుతంగా ఆడారని కితాబు ఇచ్చాడు. ఇలాగే రేపటి మ్యాచ్ కు కూడా ప్రాక్టీస్ ప్రారంభించాలని సూచించాడు సంగక్కర(Kumar Sangakkara).
Also Read : చిన్న స్వామి స్టేడియం లో తెలుగోడి సత్తా .. 46 బంతుల్లోనే 84 రన్స్ ..