Kumara Sangakkara : శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా చేశారు. ద్వీప దేశం రాజధాని కొలంబోలో శాంతియుత నిరసనకారులపై శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ఎల్పీపీ) మద్దతుదారులు దాడి జరిపారు.
శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర(Kumara Sangakkara), మహేళ జయవర్దనే తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై దాడి చేసి , టెంపుల్ ట్రీస్ ముందు ఉన్న మైనా గో గామా , గాల్ ఫేస్ గ్రీన్ వద్ద ఉన్న గోటా గో గామా రెండింటిని దాడి చేశారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాడు. మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర(Kumara Sangakkara) సీరియస్ గా స్పందించాడు.
తమ ప్రాథమిక అవసరాలు, హక్కుల గురించి ప్రస్తావించారు. శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై ప్రభుత్వంలోని దుండగులు, గూండాల మద్దతుతో దాడికి పాల్పడ్డారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసహ్యకరమైనది. ఇది రాజ్య మద్దతుతో కూడిన హింస ఇది. ఉద్దేశ పూర్వకంగానే , పక్కా ప్రణాళిక బద్దంగానే చేశారంటూ ఆరోపించారు.
ఈ విషయాన్ని కుమార సంగక్కర ట్వీట్ చేశారు. సంయమనం పాటించాలని ప్రధానమంత్రి మహింద రాజపక్సే ప్రజలకు చేసిన విజ్ఞప్తిని తీవ్రంగా తప్పు పట్టారు.
తన ప్రకటన వల్లనే అల్లర్లకు కారణమైందంటూ ఆరోపించారు కుమార సంగక్కర. శాంతియుత నిరసనకారలపై దాడి చేసేందుకు ముందు మీ కార్యాలయానికి వచ్చిన గూండాలు, దుండగులు , మీ మద్దతుదారులు మాత్రమే హింసకు కారణమంటూ ఆరోపించారు కుమార సంగక్కర.
Also Read : డేవాన్ కాన్వే మారథాన్ ఇన్నింగ్స్