Kylian Mbappe : ఎంబాప్పే హ్యాట్రిక్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో రికార్డ్

హ్యాట్రిక్ సాధించిన ఫ్రాన్స్ స్ట్రైక‌ర్

Kylian Mbappe : యావ‌త్ ప్ర‌పంచం బిగ ప‌ట్టి ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన సంబురం ముగిసింది. ఎట్ట‌కేల‌కు నెల రోజుల‌కు పైగా సాగిన సాక‌ర్ పండ‌గ‌కు తెర ప‌డింది. లియానెల్ మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా విశ్వ విజేత‌గా నిలిచింది.

కానీ అరుదైన క్ష‌ణాల‌కు వేదికైంది ఫైన‌ల్ మ్యాచ్ ఖ‌తార్ లోని దోహా వేదిక‌గా జరిగిన ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 ఫైన‌ల్ లో చివ‌రి క్ష‌ణం దాకా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది మ్యాచ్ అర్జెంటీనా, ఫ్రాన్స్ జ‌ట్ల మ‌ధ్య‌.

గోల్డెన్ బూట్ ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే దానిపై టెన్ష‌న్ వీడింది. ఓ వైపు అర్జెంటీనా దూకుడు పెంచింది. అటాకింగ్ చేస్తున్నా ఎక్క‌డా త‌గ్గ‌లేదు ఫ్రాన్స్. ఆ జ‌ట్టులో ఫుట్ బాల్ స్ట్రైక‌ర్ ఎంబాప్పే(Kylian Mbappe) మాత్రం సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచాడు.

ఏకంగా అర్జెంటీనా ఆధిప‌త్యానికి చెక్ పెట్టాడు. ఫైన‌ల్ లో ఏకంగా హ్యాట్రిక్ సాధించి విస్తు పోయేలా చేశాడు ఎంబాప్పే. అనేక మ‌లుపులు తిరిగిన ఈ కీల‌క పోరులో మెస్సీ, అర్బారెజ్ ఓ వైపు ఇంకో వైపు ఎంబాప్పే నువ్వా నేనా అన్న రీతిలో పోరాడారు.

అర్జెంటీనాపై హ్యాట్రిక్ కొట్టి టోర్నీలో త‌న గోల్స్ సంఖ్య‌ను ఎనిమిదికి చేర్చాడు ఎంబాప్పే. ఇక మెస్సీ ఫైన‌ల్ లో రెండు గోల్స్ సాధించి ఏడు గోల్స్ చేశాడు. ఇదిలా ఉండ‌గా 1966 లో ఇంగ్లండ్..జ‌ర్మ‌నీ తో జ‌రిగిన మ్యాచ్ లో జియోఫ్ హ‌ర్స్ ఫైన‌ల్ లో హ్యాట్రిక్ సాధించాడు.

ఆ త‌ర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్ పోటీల‌లో రెండో ఆట‌గాడిగా ఎంబాప్పే చ‌రిత్ర సృస్టించాడు. ఇక ఫైన‌ల్ లో అర్జెంటీనాకు చెందిన ఎమిలియానో మార్టినెజ్ టోర్నీలో ఉత్త‌మ గోల్ కీప‌ర్ అవార్డు గెలుచుకున్నాడు.

Also Read : మూడుసార్లు విశ్వ విజేత అర్జెంటీనా

Leave A Reply

Your Email Id will not be published!