Laxmi Sowjanya : తెలుగు సినిమా రంగంలో రాణించాలంటే చాలా కష్టపడాలి. పురుషాధిక్య ప్రపంచం ఇది. ఇక్కడ ఎవరూ ఎవరికీ తోడుగా ఉండరు. సక్సెస్ వచ్చాకే పలకరింపులు.
ఆ తర్వాత ఈసడింపులే. చాలా కష్టంగా ఉండే ఈ రంగంలో ఎంటర్ కావాలంటే చాలా ధైర్యం ఉండాలి.
అంతకంటే పట్టుదల కావాలి. చాలా కొద్ది మంది మాత్రమే మహిళా దర్శకులుగా రాణిస్తున్నారు.
వారిలో ఒకరు నందినీ రెడ్డి కాగా మరొకరు లక్ష్మీ సౌజన్య(Laxmi Sowjanya). ఇక షార్ట్ ఫిలింలకు సంబంధించి ఇప్పుడిప్పుడే చాలా మంది పరిచయం అవుతున్నారు.
ఆమె నాగ శౌర్య, రీతూ వర్మతో కలిసి తీసిన వరుడు కావాలెను మూవీ బిగ్ సక్సెస్ అయ్యింది.
ఎలాంటి ద్వందార్థాలు లేకుండా చాలా సింపుల్ గా , నీట్ గా తెరకెక్కించిన విధానం గొప్ప దర్శకురాలిగా పేరు తెచ్చేలా చేసింది. సినిమాకు సంబంధించిన టేకింగ్ కూడా అద్భుతంగా ఉండేలా జాగ్రత్త పడింది.
ప్రస్తుతం కొత్త ప్రాజెక్టు పనిలో ఉన్నారు. లక్ష్మీ సౌజన్య పుట్టింది కర్నూలులోని ఆళ్లగడ్డలో. పెరిగిందంతా గుంటూరు జిల్లా నరసారావు పేట. తండ్రి లెక్చరర్. 11 ఏళ్లకే పదో తరగతి పరీక్షలు రాసింది.
నలుగురిలో ఒకరిలా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడే ఆమె సినీ ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంది. 18 ఏళ్లకే హైదరాబాద్ వచ్చేసింది.
ప్రముఖ డైరెక్టర్లు తేజ, శేఖర్ కమ్ముల, కృష్ణ వంశీ, ఆర్కా మీడియా, ప్రకాశ్ కోవెల మూడి వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు లక్ష్మీ సౌజన్య. వాంటెడ్ తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
15 ఏళ్ల సుదీర్ఘమైన జర్నీ తర్వాత వరుడు కావలెనుతో పూర్తి స్థాయిలో దర్శకురాలిగా ప్రారంభించారు. తన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాల నుంచే ఆమె కథలు రాసుకుంటారు.
మనుషులందరికీ బాడీ పార్ట్స్ ఒకేలా ఉంటాయి. కానీ పోలికల్లోనే చిన్న తేడాలు ఉంటాయి అన్న కాన్సెప్ట్ తో తీసిన ఈ వరుడు కావలెను మూవీ బిగ్ సక్సెస్ . రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు తీయాలని, ఇలాగే అలరించాలని కోరుకుందాం.
Also Read : అడవి బిడ్డల ఆరాధ్య దైవం ‘సీతక్క