Lakshya Sen : ల‌క్ష్య సేన్ సంచ‌ల‌నం ‘ప‌సిడి’ కైవ‌సం

బ్యాడ్మింట‌న్ ఫైన‌ల్ లో ఘ‌న విజ‌యం

Lakshya Sen : బ‌ర్మింగ్ హోమ్ వేదిక‌గా జ‌రుగుతున్న కామ‌న్వెల్త్ గేమ్స్ -2022లో భార‌త్ ప‌త‌కాల వేట కొన‌సాగుతోంది. ఇవాళ ప‌లు విభాగాల‌లో ప‌త‌కాలు ద‌క్కాయి. స్టార్ షెట్ల‌ర్ మొద‌టిసారిగా పీవీ సింధు బంగారు ప‌త‌కాన్ని సాధించింది.

తాజాగా పురుషుల సింగిల్స్ బ్యాడ్మింట‌న్ ఫైన‌ల్ లో తొలి స్వ‌ర్ణం సాధించాడు ల‌క్ష్య సేన్(Lakshya Sen). మ‌లేషియాకు చెందిన ఎన్జీ త్జే యోంగ్ ను 19-21, 21-9, 21-16 తేడాతో ఓడించాడు. బంగారు ప‌త‌కాన్ని సాధించి భార‌తీయ మువ్వొన్నెల ప‌తాకాన్ని ఎగుర వేసేలా చేశాడు.

కాగా ఈ ఫైన‌ల్ మ్యాచ్ గంట‌కు పైగా ఉత్కంఠ భ‌రితంగా సాగింది. భార‌త దేశం థామ‌స్ కప్ విజ‌యంలో ముందంజ‌లో ఉన్నాడు. ఆపై ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్ లో కాంస్య ప‌త‌కాన్ని సాధించాడు.

ఆనాటి నుంచి నేటి కామ‌న్వెల్త్ దాకా ల‌క్ష్య సేన్ త‌న ఫామ్ ను కొన‌సాగిస్తూ వ‌చ్చాడు. బ్యాడ్మింట‌న్ లో వేగంగా ఎదుగుతున్న స్టార్ గా నిలిచాడు. ఇంకా 21 ఏళ్లు నిండ లేదు.

ఇంకా ఎనిమిది రోజుల దూరంలో ఉన్నాడు. పీవీ సింధుతో పాటు ల‌క్ష్య సేన్(Lakshya Sen) ఇద్ద‌రూ బంగారు ప‌త‌కాలు సాధించి భార‌త దేశానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచాడు.

తాజాగా క‌డ‌ప‌టి స‌మాచారం అందే వ‌ర‌కు ల‌క్ష్య‌సేన్ సాధించిన ప‌సిడి ప‌త‌కంతో భార‌త్ ప‌త‌కాల సంఖ్య 57కి పెరిగింది. ఇక ప్ర‌త్య‌ర్థి యోంగ్ ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. అద్భుత‌మైన బ్యాక్ హ్యాండ్ షాట్స్ తో చుక్క‌లు చూపించాడు.

కాగా భార‌తీయ అథ్లెట్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో స‌త్తా చాట‌డంతో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వారంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు.

Also Read : శ్రీ‌జ శ‌ర‌త్ జంట‌కు బంగారు ప‌త‌కం

Leave A Reply

Your Email Id will not be published!