Lal Chand Rajput : భారత్ కు షాక్ ఇవ్వడం ఖాయం
లాల్ చంద్ రాజ్ పుత్ కామెంట్స్
Lal Chand Rajput : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ , జింబాబ్వే టెక్నికల్ డైరెక్టర్ లాల్ చంద్ రాజ్ పుత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది.
ఇందులో భాగంగా మూడు వన్డేలు ఆడనుంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. జింబాబ్వేను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించాడు.
ఒకప్పటి మాజీ ఓపెనర్ గా అనుభవం ఉంది. 2018 నుంచి జింబాబ్వే జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఆ జట్టును అత్యంత పటిష్టవంతంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు.
ప్రస్తుతం టీమిండియా పర్యటిస్తున్న సందర్భంగా లాల్ చంద్ రాజ్ పుత్(Lal Chand Rajput) మీడియాతో మాట్లాడాడు. ఏ జట్టునైనా వరల్డ్ లో ఓడించేందుకు తమ జట్టు సిద్దంగా ఉందని ప్రకటించాడు.
గత కొంత కాలంగా తమ జట్టు ఇతర టాప్ దేశాలతో మ్యాచ్ లు ఆడలేదన్నారు. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా, సఫారీ జట్లతో ఆడాల్సి ఉందన్నారు.
తాజాగా ఇండియాతో జింబాబ్వే ఆడడం వల్ల కొంత అనుభవం దక్కుతుందన్నారు. అటు బౌలింగ్ లోనూ బ్యాటింగ్ లోనూ తమ జట్టు సత్తా చాటేందుకు రెడీగా ఉందన్నారు లాల్ చంద్ రాజ్ పుత్.
కొన్ని అనివార్య కారణాల వల్ల జింబాబ్వే ఇతర జట్లతో ఆడలేక పోయిందన్నాడు. ఇక 2016 తర్వాత భారత్ ఇక్కడ పర్యటించడం వల్ల జింబాబ్వే ప్లేయర్లకు ఒక పాఠంగా ఉపయోగ పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు టెక్నికల్ డైరెక్టర్.
ప్రస్తుతం తమ జట్టులో భారత్ ఆటగాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారంటూ స్పష్టం చేశారు.
Also Read : జార్ఖండ్ డైనమెట్ కు బీసీసీఐ ఝలక్