Rohini Acharya Lalu Prasad : పాపా నిండు నూరేళ్లు బతకాలి
లాలూ ప్రసాద్ కూతురు రోహిణి ఆచార్య
Rohini Acharya Lalu Prasad : బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం గురించి కూతురు రోహిణి ఆచార్య చేసిన భావోద్వేగంతో కూడిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు జన్మ ఇచ్చిన తండ్రికి కిడ్నీ ఇచ్చింది ఆమె. దేశ వ్యాప్తంగా రోహిణి ఆచార్య చేసిన త్యాగానికి ఫిదా అయ్యింది. ఈ కాలంలో పేరెంట్స్ ను బరువుగా భావించే తరుణంలో ఆమె చేసిన పని ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా చేసింది.
ఇదిలా ఉండగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంత కాలం నుంచి. సింగపూర్ లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. శనివారం సింగపూర్ నుంచి బీహార్ కు ప్రత్యేక విమానంలో లాలూ ప్రసాద్ యాదవ్ రానున్నారు. ఈ సందర్బంగా కూతురు రోహిణి ఆచార్య(Rohini Acharya) తన తండ్రికి ఆరోగ్యం బాగుండేలా చూడాలని ఆ పరమాత్ముడిని కోరుకుంది.
ఆమె తన తండ్రి లాలూను పాపా అని అప్యాయంగా పిలుచుకుంటుంది. అందుకే నువ్వు నిండు నూరేళ్లు బతకాలి అంటూ కోరుకుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రతి ఒక్కరు ఆమెను ప్రశంసిస్తూనే లాలూ క్షేమంగా భారత్ కు తిరిగి రావాలని కోరుతున్నారు. ట్వీట్ లో ఇలా రాశారు.
ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పాపాజీ ఆరోగ్యం గురించి. కూతురిగా నా డ్యూటీ నేను చేస్తున్నాను. నాన్నకు ఆరోగ్యం చేకూర్చాక పంపిస్తున్నా. మీ అందరి మధ్య మీరంతా మా నాన్నను చూసుకుంటారని ఆశిస్తున్నానని భావోద్వేగంతో పోస్ట్ చేసింది.
Also Read : సైఫుద్దీన్ జీ నేను మీ వాడినే – మోదీ