Lasith Malinga Coach : శ్రీలంక జట్టు బౌలింగ్ కోచ్ గా మలింగ
ప్రకటించిన శ్రీలంక క్రికెట్ బోర్డు
Lasith Malinga Coach : శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన స్టార్ పేసర్ లసిత్ మలింగకు అరుదైన చాన్స్ లభించింది. ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు.
అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించేలా తీర్చిదిద్దాడు. ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక రాజస్తాన్ జట్టుకు డైరెక్టర్ గా హెడ్ కోచ్ గా ఇదే శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఉన్నాడు.
రాజస్తాన్ యాజమాన్యం ఏరికోరి లసిత్ మలింగ(Lasith Malinga Coach) ను ఎంచుకుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి జరిగిన ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు దుమ్ము రేపారు.
ప్రధానంగా ప్రసిద్ద్ క్రిష్ణ, ట్రెంట్ బౌల్ట్ , కుల్దీప్ సేన్ , యుజ్వేంద్ర చాహల్ , మెక్ కాయ్ , ఆర్. అశ్విన్ సూపర్ బౌలింగ్ చేశారు. వీరి ప్రతిభలో మలింగ పాత్ర ఉంది.
దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో ఈనెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సీరీస్ లో పాల్గొనే శ్రీలంక జట్టుకు బౌలింగ్ వ్యూహాత్మక కోచ్ గా లసిత్ మలింగ(Lasith Malinga Coach) ను ఎంపిక చేసింది.
ఇదిలా ఉండగా లంక, ఆసిస్ జట్ల మధ్య 7, 8, 11 తేదీల్లో 3 టీ20 మ్యాచ్ లు జరుగుతాయయి. ఇక 14, 16, 19, 21, 24 తేదీలలో 5 వన్డేలు ఆడనుంది శ్రీలంక. జూన్ 29 నుంచి రెండు టెస్టులు ఆడనుంది ఆస్ట్రేలియా.
టీ20, వన్డేలు, టెస్టులు కలిపి 10 మ్యాచ్ లు ఆడనుంది శ్రీలంక. ఇదిలా ఉండగా ఇరు జట్లు కొలంబో, పల్లకెలె, గాలే వేదికగా మ్యాచ్ లు ఆడతాయి.
Also Read : విహారి రాణిస్తే బెటర్ లేదంటే కష్టం