Lata Kapil Devils : యావత్ భారత దేశం గాన కోకిల లతా మంగేష్కర్ మరణంతో శోక సంద్రంలో మునిగి పోయింది. 92 ఏళ్ల జీవిత ప్రస్థానంలో 20 భాషలలో 30 వేలకు పైగా పాటలు పాడారు. ప్రపంచ వ్యాప్తంగా లతాజీకి (Lata Kapil Devils)వేలాది మంది అభిమానులు ఉన్నారు.
ఆమె పాడిన పాటలు నేటికీ లక్షలాది పెదవుల మీద పాడుతూనే ఉంటాయి.
కానీ లతా మంగేష్కర్ గురించి తెలియని కోణాలు ఉన్నాయి. ఒకటి ఆమెకు ఫోటోలు తీయడం అంటే ఇష్టం.
తను మంచి ఫోటోగ్రాఫర్ కూడా. అంతే కంటే ఎక్కువగా లతా మంగేష్కర్ కు క్రికెట్ అంటే వల్ల మాలిన అభిమానం.
ఇక ఆమె ఎందరికో గుప్త దానాలు చేశారు. ఎందరినో ఆదుకున్నారు.
ప్రస్తుతం ఆమె భారత దేశంలో క్రికెట్ ఆటకు ఆదరణ పెరిగేందుకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించారు.
ఈ విషయాన్ని సాక్షాత్తు బీసీసీఐ గుర్తు చేసుకుంది. ఆమెకు అరుదైన నివాళులు అర్పించింది.
ఇక అసలు విషయానికి వస్తే భారత క్రికెట్ లో 1983 ఓ ఉజ్వల ఘట్టం. ఎందుకంటే ప్రపంచ క్రికెట్ చరిత్రలో మొట్ట మొదటిసారిగా
హర్యానా కరేన్ కపిల్ దేవ్ నిఖంజ్ సారథ్యంలోని టీమిండియా వెస్టిండీస్ ను ఓడించి ప్రపంచ కప్ సాధించింది.
ఈ సందర్భంగా భారత దేశమంతా సంబురాలు జరుపుకుంది. ఇదే సమయంలో ఆనాటి ప్రధాన మంత్రి, రాష్ట్రపతి తో టీం ములాఖత్ అయ్యింది. అయితే టీమిండియా కోసం తన వంతు సాయం చేసింది లతా మంగేష్కర్.
ఢిల్లీలో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆమెకు గవస్కార్, సచిన్ తో సంబంధం ఉంది. సచిన్ ఆమెను అమ్మతో పోల్చడం విశేషం.
1983లో విజేతగా నిలిచిన భారత జట్టును ఎలా సత్కరించాలి అని సందిగ్ధంలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు సహాయం చేసింది లతా మంగేష్కర్.
ప్రస్తుతం ప్రపంచంలో బీసీసీఐ అత్యధిక ఆదాయం కలిగి ఉంది. ఊ. 50 వేల కోట్లకు దగ్గరగా ఉందని సమాచారం. కానీ 1983 కంటే ముందు బీసీసీఐ పరిస్థితి దారుణంగా ఉండేది.
జగన్మోహన్ దాల్మియా వచ్చాక దాని సీన్ ఒక్కసారిగా మారింది. ఆనాడు క్రీడా శాఖ మంత్రిగా కేపీ సాల్వే ఉన్నారు. సాల్వే ఆనాడు రాజ్ సింగ్ దుంగాపూర్ ను సంప్రదించాడు.
ఆయనకు లతా దీదీతో దగ్గరి అనుబంధం ఉంది. ఆమె ఒప్పుకుంది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సంగీత విభావరి చేపట్టింది. రెండు గంటల పాటు పాటలతో అలరించింది.
ఆ ఒక్క కార్యక్రమం ద్వారా భారీగా డబ్బులు సమకూరాయి. దీంతో బీసీసీఐ ఆరోజుల్లో ఒక్కో ఆటగాడికి రూ. లక్ష అందించింది. లతా మంగేష్కర్ చేసిన సాయాన్ని ఇప్పటికీ మరిచి పోలేదు బీసీసీఐ.
ఆమె కోసం రెండు వీఐపీ టికెట్లను జీవితాంతం వరకు కేటాయించింది.
Also Read : 92 ఏళ్లు 92 సంగీత దర్శకులు