Badal Family : పంజాబ్ లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలు భారీ ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు వస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 117 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉంది. ఈసారి కాంగ్రెస్ పార్టీతో పాటు శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ బరిలో ఉన్నారు.
బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, ఆప్ మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఇప్పటికే ప్రస్తుతం ఉన్న చరణ్ జిత్ సింగ్ చన్నీని సీఎంగా డిక్లేర్ చేసింది.
ఇక ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ అభ్యర్థి సీఎంగా భగవంత్ మాన్ ను ప్రకటించింది. కొత్త పద్దతికి శ్రీకారం చుట్టింది. ఇవాళ భగవంత్ మాన్ తో పాటు సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు.
తాజాగా శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ , బటిండా ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ బాదల్, హర్కీరత్ కౌర్ బాదల్(Badal Family )లు ముక్తసర్ జిల్లా లోని లంబి నియోజకవర్గంలోని బాదల్ గ్రామంలో ఓటు వేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు అకాళీదళ్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్. లా అండ్ ఆర్డర్, మత సామరస్యం ముఖ్యమన్నారు. ఆయనకు 94 ఏళ్లు. సిద్దూ, మన్ , జఖర్, పర్గత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ మాట్లాడుతూ ఆప్ పంజాబ్ ను సమూలంగా మార్చాలని చూస్తోంది. ఇది సరిహద్దు రాష్ట్రానికి మరణ శాసనమని ఆరోపించారు..
Also Read : అందరి చూపు అఖిలేష్ వైపు