Isha Ambani : తండ్రికి తగ్గ తనయ ఇషా అంబానీ
చైర్ పర్సన్ కంటే ముందు డైరెక్టర్
Isha Ambani : ఇషా అంబానీ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. భారత దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన వ్యాపార వేత్త, బిలీయనీర్ గా పేరొందిన రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ముద్దుల కూతురే ఈ ఇషా అంబానీ(Isha Ambani) .
తాజాగా రిలయన్స్ సంస్థలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తనయుడు ఆకాష్ అంబానీకి రిలయన్స్ డిజిటల్ కు సంబంధించిన జియోకు చైర్మన్ గా ఎంపిక చేశారు.
ఇదే సమయంలో అదే రంగానికి ధీటుగా ఉన్న దేశ వ్యాప్తంగా విస్తరించిన వేల కోట్ల ఆదాయం గడిస్తున్న రిలయన్స్ రిటైల్ యూనిట్ కు ఇషా అంబానీని చైర్ పర్సన్ గా ఎంపిక చేశారు తండ్రి ముఖేష్ అంబానీ.
ఈ మేరకు బుధవారం కీలక నిర్ణయం ప్రకటించింది రిలయన్స్. మరి ఇషా అంబానీ ఇంతటి స్థాయికి రావడానికి గల కారణం మొదటి నుంచీ అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ఆరితేరారు.
వ్యాపార రంగంలో జియోను పరుగులు తీయడంలో వీరిద్దరి కీలక పాత్ర ఉందన్నది వాస్తవం. ఇక ఇషా అంబానీ ఇదే సంస్థలో డైరెక్టర్ గా ఉన్నారు.
ప్రస్తుతానికి ఆమె వయస్సు 30 ఏళ్లు. ప్రతిష్టాత్మక యేల్ యూనివర్శిటీలో సైకాలజీ చదివారు. ఆ తర్వాత స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీయే పూర్తి చేశారు ఇషా అంబానీ.
పిరమల్ గ్రూప్ నకు చెందిన అజయ్ , స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్ ను పెళ్లి చేసుకున్నారు. 2008లో ఫోర్బ్స్ రూపొందించిన అత్యంత పిన్న వయసు కలిగిన నాయకురాలిగా చోటు దక్కించుకుంది ఇషా అంబానీ(Isha Ambani) .
ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ నికర విలువ రూ. 471 కోట్లుగా ఉంది.
Also Read : ఇషా అంబానీ చేతికి రిలయన్స్ రిటైల్