#Lenovo : బడా కంపెనీల చూపు ఇండియా వైపు
వరల్డ్ వైడ్ మార్కెట్ లో ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉన్న దేశాలు చైనా, ఇండియా మాత్రమే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఐటీ, లాజిస్టిక్, స్టీల్, ఐరన్, సిమెంట్, టాయిస్, యాక్ససరీస్, కంప్యూటర్లు, మొబైళ్ల కంపెనీలన్నీ ఇండియా జపం చేస్తున్నాయి.
Lenovo : ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా కుదుపులకు లోనవుతోంది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం చోటు చేసుకున్నప్పుడు అన్ని దేశాలు తట్టుకోలేక చతికిల పడితే భారత దేశం మాత్రం అన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కింది. దానికి కారణం ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులు, పోస్టాపీసులు. వంద కోట్లకు పైగా ఉన్న జనాభాలో అత్యధిక శాతం పేదలు, నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు 80 శాతానికి పైగా ఉన్నారు. వీరంతా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వచ్చిన దాంట్లోంచి కొంత మొత్తంలో దాచు కోవడం అలవాటు. అదే ఈ దేశాన్ని ఆర్థిక మాంద్యం నుంచి కాపాడేలా చేసింది. వరల్డ్ వైడ్ మార్కెట్ లో ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉన్న దేశాలు చైనా, ఇండియా మాత్రమే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఐటీ, లాజిస్టిక్, స్టీల్, ఐరన్, సిమెంట్, టాయిస్, యాక్ససరీస్, కంప్యూటర్లు, మొబైళ్ల కంపెనీలన్నీ ఇండియా జపం చేస్తున్నాయి.
తాజాగా చైనాకు చెందిన లెనోవో కంపెనీ టాబ్లెట్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పబోతున్నట్లు వెల్లడించింది. కరోనా వ్యాధి మహమ్మారి దెబ్బకు ప్రపంచమంతా వర్క్ ఫ్రం హోం కు ప్రయారిటీ పెరిగింది. ఈ లెర్నింగ్, వర్చువల్ టెక్నాలజీకి డిమాండ్ భారీగా పెరిగింది. ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు వాటి అనుబంధ యాక్ససెరీలకు పని పడింది. ఎడ్యూకేషన్ సెక్టార్ నుంచి హెవీ డిమాండ్ ఉంటోంది. టాబ్లెట్లతో పాటు ల్యాప్ ట్యాప్ లను కూడా ఇక్కడే తయారు చేయాలని అనుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తే 25 నుంచి 30 శాతం వాటా దక్కించు కోవచ్చని ఆలోచిస్తోంది. కన్జూమర్ మార్కెట్ 40 లక్షలుగా ఉంటోంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని లెనోవో భావిస్తోంది. గత ఏడాది లెనోవోకి ఈఎల్సీఓటీ నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చింది.
తమిళనాడు ప్రభుత్వానికి దాని స్కీమ్‌లకు ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సేవలందించేందు కోసం పని చేస్తోంది నోడల్ ఏజెన్సీ. ఆ రాష్ట్రంలోని 15 లక్షల ల్యాప్ ట్యాప్ లను లెనోవో అందించాల్సి ఉంటుంది. ఐడీసీ అంచనా ప్రకారం లెనోవో కు భారీగా మార్కెట్ ఉంటోందని పేర్కొంది. కన్జూమర్ సెగ్మెంట్ లో 40 శాతం గ్రోత్ ను కలిగి ఉండడంతో లెనోవో కంపెనీ ఇండియాలోనే తయారు చేయాలని డిసైడ్ అయింది. ల్యాప్ ట్యాప్‌ల కంటే టాబ్లెట్ల కోసం ఎక్కువ డిమాండ్ ఉంటోంది లెనోవో కంపెనీ నుంచి. 60 శాతానికి పైగా మార్కెట్ షేర్ ఉండడంతో కంపెనీ ఫుల్ జోష్ లో ఉంది. మొత్తం మీద లెనోవో కంపెనీకి ఈ ఏడాది మంచి సపోర్ట్ దొరికినట్టే.

No comment allowed please