#Vennelakanti : సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత
Vennelakanti: తెలుగు సినిమా మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పాటలు రాసి మెప్పించిన వెన్నలకంటి గుండె పోటుతో చెన్నైలో మృతి చెందారు. వెన్నలకంటి పూర్తి పేరు రాజేశ్వర ప్రసాద్. 300 సినిమాలకు పని చేసిన ఆయన 2 వేలకు పైగా పాటలు రాశారు. ఆయన ఆకస్మిక మృతితో సినిమా రంగం ఓ మంచి వ్యక్తిని అంతకంటే అద్భుతమైన రచయితను కోల్పోయింది.
Vennelakanti: తెలుగు సినిమా మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పాటలు రాసి మెప్పించిన వెన్నలకంటి గుండె పోటుతో చెన్నైలో మృతి చెందారు. వెన్నెలకంటి పూర్తి పేరు రాజేశ్వర ప్రసాద్. 300 సినిమాలకు పని చేసిన ఆయన 2 వేలకు పైగా పాటలు రాశారు. ఆయన ఆకస్మిక మృతితో సినిమా రంగం ఓ మంచి వ్యక్తిని అంతకంటే అద్భుతమైన రచయితను కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన ఆయనకు చిన్న నాటి నుంచే హరి కథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్ట పడేవారు. కాలేజీ రోజుల్లో రేడియోలో ప్రసారమయ్యే రసవినోదిని అంటే చెవి కోసుకునే వారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలు రాసి మెప్పించారు. 1975లో విజయవాడ రేడియో కేంద్రం కవితల పోటీలో పాల్గొన్నారు. వెన్నలకంటి(Vennelakanti) రాసిన 9 కవితలు ఎంపికయ్యాయి. ప్రముఖ దర్శకుడు జంధ్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో ఆయన నటించారు.
ప్రముఖ నటుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రోద్భలంతో శ్రీరామచంద్రుడు సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు. అదే ఆయనకు తొలి పాట. ఇదే మొదటి పరిచయం సినిమా రంగానికి. ఆ తర్వాత అన్నా చెల్లెలు సినిమాకు పని చేశారు. ఆకట్టుకునే గీతాలు అందించారు. మణిరత్నం కమలహాసన్ తీసిన నాయకుడు సినిమాతో అనువాదంలోకి ప్రవేశించారు. ప్రేమాగ్ని సినిమాకు మాటలు రాశారు. అదే కమల్ నటించిన సత్య భామ సినిమాకు డబ్బింగ్ రాశారు. ఆయన కుమారులు శశాంక్ వెన్నెల కంటి డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగాను, మరో కుమారుడు రాకేందు మౌళి సినిమా గీత రచయితగా ఎదుగుతున్నారు. చిరునవ్వుల వరమిస్తావా చితి నుంచి పైకొస్తా అన్న సాంగ్ హైలెట్. అదే విధంగా వెన్నెల కంటి రాసిన సినిమాల్లో ఎక్కువగా పాపులర్ అయిన పాటలు ఈ సినిమాలోనివే ఉన్నాయి.

బిరియానీ, ఆవారా, ఆకాశమంత, ఒక్క మగాడు, కొంచెం టచ్లో ఉంటే చెపుతాను. చంద్రముఖి, పల్నాటి బ్రహ్మనాయుడు, టక్కరి దొంగ, నరసింహ నాయుడు, అన్నయ్య, సమర సింహా రెడ్డి, శ్రీను, దెయ్యం, శ్రీకార్జున విజయం, భైరవ ద్వీపం, ముగ్గురు మొనగాళ్లు, వన్ బై టూ సినిమాలలోని పాటలు హిట్ పెయిర్ గా నిలిచాయి. అల్లరి ప్రియుడు, స్వాతి కిరణం, ఆదిత్య 369, ఏప్రిల్ 1 విడుదల, తేనెటీగ, బార్గవ్, శ్రీరామచంద్రుడు, చెట్టుకింద ప్లీడరు, మహర్షి, ఇదా ప్రపంచం సినిమాలు ఉన్నాయి. రాసలీల వేళ రాయబేర మేళ, మధురమే సుధా గానం మనకిదే మరో ప్రాణం, కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి లాంటి వైవిధ్య భరితమైన గీతాలు వెన్నెల కంటి కలం లోంచి జాలు వారినవే. గొప్ప ప్రతిభావంతుడిని, వైవిధ్య భరితమైన రచయితను కోల్పోవడం సినిమా రంగానికి, సాహిత్యానికి తీరని లోటు.

No comment allowed please