Leo Vijay Poster Viral : లియో విజ‌య్ పోస్ట‌ర్ వైర‌ల్

19 అక్టోబ‌ర్ న సినిమా విడుద‌ల

Leo Vijay Poster Viral : త‌మిళ సినీ న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్ హాట్ టాపిక్ గా మారారు. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాడు. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టిస్తున్న లియో(Leo) చిత్రానికి సంబంధించి గురువారం మూవీ మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీనికి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింది.

భారీ తారాగ‌ణంతో దీనిని తెర‌కెక్కిస్తున్నారు. పైకి రూ. 250 కోట్ల బ‌డ్జెట్ అని చెప్పినా అంత‌కు మించి ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. ఇక త‌ళ‌ప‌తి విజ‌య్ తో పాటు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కూడా ఇందులో న‌టిస్తుండం విశేషం.

ఇవాళ జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పుట్టిన రోజు. ఆయ‌న‌కు 49 ఏళ్లు. ఆయ‌న‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొద‌ట్లో బాల న‌టుడిగా న‌టించాడు. 1992 నుంచి మెయిన్ స్ట్రీమ్ హీరో అయ్యాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 61 సినిమాలు తీశాడు. న‌టుడిగానే కాదు విజ‌య్ మంచి గాయ‌కుడు కూడా. విద్యార్థుల‌ను ఆదుకోవ‌డంలో ముందంటాడు. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తో త్వ‌ర‌లోనే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీనిపై ఇంకా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌లేదు త‌ళ‌ప‌తి విజ‌య్. ఆయ‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు న‌టుడు. ప్ర‌తి ఒక్క‌రు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ తో పాటు పెరియార్, కామ‌రాజ్ ను చ‌ద‌వాల‌ని కోరారు. విలువైన ఓటు ప‌ని చేసే వారికి వేయాల‌ని పిలుపునిచ్చాడు.

Also Read : Rahul Gandhi Modi : మ‌ణిపూర్ కాలి పోతుంటే మౌన‌మేల‌

 

Leave A Reply

Your Email Id will not be published!