Roger Binny : బీసీసీఐ బాస్ గా బిన్నీకి లైన్ క్లియ‌ర్

సౌర‌వ్ గంగూలీ ప్లేస్ లో మాజీ క్రికెట‌ర్

Roger Binny : దేశ క్రీడా రంగంలో మోస్ట్ పాపుల‌ర్ క్రీడా సంస్థ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క‌టి భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ). ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇంకా వారం రోజుల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉంది. అక్టోబ‌ర్ 18న ఎవ‌రు బీసీసీఐకి బాస్ అవుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

ఇప్ప‌టి వ‌ర‌కు బీసీసీఐ బాస్ గా ఉన్న గంగూలీ త‌న ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. ఆయ‌న మ‌రోసారి పోటీ చేయ‌డం లేదు. త‌ను ఐసీసీ చైర్మ‌న్ రేసులో ఉన్నాడు. ఇక కేంద్ర మంత్రి అమిత్ షా త‌న‌యుడు జే షా కార్య‌ద‌ర్శితో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ గా కొన‌సాగుతున్నాడు.

ఇక తాజాగా జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎక్కువగా 1983 వ‌రల్డ్ క‌ప్ జ‌ట్టులో స‌భ్యుడైన రోజ‌ర్ బిన్నీ(Roger Binny) బీసీసీఐ బాస్ కానున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న మాజీ ఆల్ రౌండర్ గా పేరొందారు. ఆయ‌న‌కే ఎక్కువ ఛాన్స్ ఉంది. బిన్నీ ప్ర‌స్తుతం క‌ర్నాట‌క స్టేట్ క్రికెట్ అసోసియేష‌న్ లో ఆఫీస్ బేర‌ర్ గా ఉన్నాడు.

గ‌తంలో బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ స‌భ్యుడిగా ప‌ని చేశాడు. 2019లో బీసీసీఐ బాస్ గా ఎన్నిక‌య్యాడు బెంగాలీ దాదా గంగూలీ. ఇక ఇందుకు సంబంధించి నామినేష‌న్లు అక్టోబ‌ర్ 11, 12 వ‌ర‌కు మాత్ర‌మే స‌మ‌ర్పించాల్సి ఉంది. నామినేష‌న్ల ప‌రిశీల‌న 13న జ‌రుగుతుంది. 14న ఉప‌సంహ‌రించు కునేందుకు వీలుంటుంది.

విశ్వ‌సనీయ స‌మాచారం మేర‌కు జే షా బీసీసీఐ కార్య‌ద‌ర్శిగా కొన‌సాగే అవ‌కాశం ఉంది. త‌దుప‌రి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా ముందున్నార‌ని వ‌ర్గాలు పేర్కొన్నాయి. అస్సాం క్రికెట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ దేబోజిత్ సైకియాతో పాటు ఢిల్లీ , జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ హెడ్ రోహ‌న్ జైట్లీ జాయింట్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వికి పోటీలో ఉన్నారు.

కోశాధికారి ప‌ద‌వికి ఆశిష్ సెలార్ , ప్ర‌స్తుత బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ పోటీ చేసే అవ‌కాశం ఉంది. త‌దుప‌రి ఐపీఎల్ చైర్మ‌న్ గా ధుమాల్ పేరు కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : అజారుద్దీన్ పై మ‌రో కేసు న‌మోదు

Leave A Reply

Your Email Id will not be published!