Lingayat Vote Comment : ‘లింగాయత్’ లు ఎటు వైపు
కన్నడ నాట డిసైడ్ ఫ్యాక్టర్
Lingayat Vote Comment : కర్ణాటకలో ఎన్నికల వేడి రాజుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచింది. పోటీ ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా త్రయం పలుమార్లు పర్యటించారు. పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేశారు.
మే 10న పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడవుతాయి. 224 సీట్లు ఉన్నాయి. 140 సీట్లు గెలుచుకున్న పార్టీనే అధికారంలోకి రాగలుగుతుంది. ఇది పక్కన పెడితే పవర్ లోకి రావాలంటే ప్రధానంగా లింగాయత్(Lingayat Vote) సామాజిక వర్గం కీలకంగా మారనుంది. ఈ కులానికి చెందిన వారే అతిరథ మహారథులుగా పేరు పొందారు.
తాజాగా అధికార బీజేపీకి లింగాయత్ కమ్యూనిటీకి చెందిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ , మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మన్ సవాది ఉన్నట్టుండి బీజేపీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇది కాషాయానికి భారీగా నష్టం వాటిల్లనుంది. కానీ ప్రతిపక్ష పార్టీకి బలంగా మారింది.
ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పేర్లు లేక పోవడంతో తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంతా ఎక్కువగా లింగాయత్ వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అవినీతి, అక్రమాలు ఇప్పుడు ప్రధాన ఆరోపణలుగా మారాయి.
ఇది బీజేపీ సర్కార్ కు తీరని ఇబ్బందిగా మారింది. ఇక రాష్ట్ర జనాభాలో లింగాయత్ ల(Lingayat Vote Comment) శాతం 14 నుండి 17 శాతం వరకు ఉంది. బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంది ఇప్పటి దాకా. ఒక్క లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఎనిమిది మంది సీఎంలు ఉన్నారు. 2018లో కన్నడ నాట జరిగిన ఎన్నికల్లో 52 మంది గెలిచిన వారంతా ఇదే కులానికి చెందిన వారు కావడమే. బీజేపీ ఏకంగా నాలుగో వంతు లింగాయత్ లకు కేటాయించింది.
రాష్ట్రంలోని 224 స్థానాల్లో 70 స్థానాల్లో ప్రధానంగా ఉత్తర, మధ్య కర్ణాటకలో లింగాయత్ లు ప్రభావితం చేస్తుంది. షెట్టర్ తాను 25 సీట్లను ప్రభావితం చేస్తానని ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే 150 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని చెబుతున్నారు.
లింగాయత్ నేత , మాజీ సీఎం యడ్యూరప్ప ఇప్పటికీ పెద్ద దిక్కుగా ఉన్నారు. కానీ బొమ్మైతో ప్రస్తుతం చెడింది. ఇక కర్ణాటకలో చేరికలు రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా ప్రస్తుతం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్ లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది తేలనుంది.
Also Read : సూరత్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు