Lionel Messi : గోల్స్ సూప‌ర్ మెస్సీ అదుర్స్

5-0తో అర్జెంటీనా విక్ట‌రీ

Lionel Messi : ప్ర‌పంచ దిగ్గ‌జ ఫుట్ బాల‌ర్ అర్జెంటీనా స్టార్ ల‌యెన‌ల్ మెస్సీ(Lionel Messi) అరుదైన ఘ‌న‌త సాధించాడు. మ‌రోసారి ఐదు గోల్స్ తో హోరెత్తించాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. స్పెయిన్ లోని పాంప్లొనా వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో స‌త్తా చాటాడు.

ఏకంగా ఐదు గోల్స్ చేసి విస్తు పోయేలా చేశాడు మెస్సీ. ఎస్తోనియాతో జ‌రిగిన అర్జెంటీనా లీగ్ మ్యాచ్ లో 5-0తో ఘ‌న విజ‌యం సాధించింది. కాగా మ్యాచ్ లో భాగంగా మెస్సీ ఒక్క‌డే 5 గోల్స్ చేశాడు.

త‌న కెరీర్ లో మ‌రో మైలురాయిగా మిగిలి పోతుంది. ఇక ల‌యెన‌ల్ మెస్సీ ఈ ఐదు గోల్స్ ను 8వ నిమిషంలో, 45, 47, 71, 76 నిమిషాల‌లో చేశాడు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో దేశం త‌ర‌పున ఆడుతూ మెస్సీ ఒకే మ్యాచ్ ఇన్ని గోల్స్ చేయ‌లేదు.

ఇక జాతీయ జ‌ట్ల త‌ర‌పున అత్య‌ధిక గోల్స్ చేసిన క్రీడాకారుల లిస్టులో మెస్సీ(Lionel Messi) నాలుగో ప్లేస్ కు చేరుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా 86 గోల్స్ చేశాడు.

తొలి మూడు స్థానాల్లో పోర్చుగ‌ల్ కు చెందిన‌ క్రిస్టియానో రొనాల్డో 117 గోల్స్ చేశాడు. ఇరాన్ కు చెందిన మ‌రో ఫుట్ బాల‌ర్ అలీ దాయ్ 109 గోల్స్ సాధించాడు. మూడో స్థానంలో మ‌లేషియాకు చెందిన ముఖ్తార ద‌హ‌రి 89 గోల్స్ చేశాడు.

కాగా లియోనెల్ మెస్సీ 5 గోల్స్ సాధించ‌డంపై క్రిస్టియ‌న్ రొనాల్డో స్పందించాడు. మెస్సీని ఎల్ల‌ప్పుడూ ఒక కంట క‌నిపెట్టుకుని ఉండాల‌న్నాడు. లేక పోతే గోల్స్ చేసుకుంటూ వెళ్లి పోతాడ‌ని పేర్కొన్నాడు.

Also Read : యూఏఈ టీ20 లీగ్ షెడ్యూల్ ఖ‌రారు

Leave A Reply

Your Email Id will not be published!