Lionel Messi : ఆట అంటే దేశ ప‌తాకం ఆత్మ గౌర‌వం

విజ‌యం ప్రామాణికం కాదన్న మెస్సీ

Lionel Messi : ఓ సాధార‌ణ కూలీ కొడుకు సాధించిన అద్భుత విజ‌యం ఇది. అర్జెంటీనా ఇవాళ పండుగ‌లో మునిగి పోయింది. ఎక్క‌డ చూసినా సంబురాలు కొన‌సాగుతున్నాయి. ఆ దేశంలో ఫుట్ బాల్ కు ఉన్నంత ప్ర‌యారిటీ ఇంకే దానికి ఉండ‌దు. ప్రాణాల కంటే ఎక్కువ‌గా ప్రేమిస్తారు సాక‌ర్ ను. గ‌త నెల రోజుల‌కు పైగా ఖ‌తార్ లో సాక‌ర్ ఫెస్టివ‌ల్ జ‌రిగింది.

ఫైన‌ల్ పోరుతో ముగిసింది. లియోనెల్ మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా ఫ్రాన్స్ పై 4-2 తేడాతో ఓడించి విశ్వ విజేత‌గా నిలిచింది. క‌ప్ గెలుచుకున్న అనంత‌రం స్కిప్ప‌ర్ మెస్సీ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. ఇన్నేళ్ల నా జ‌ర్నీలో ఇదో మ‌ధుర‌మైన క్ష‌ణంగా గుర్తుండి పోతుంది. ఎందుకంటే నా సుదీర్ఘ క‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకోవ‌డం. కోట్లాది అభిమానులు నాపై న‌మ్మ‌కం పెట్టుకున్నారు.

వాళ్లు న‌న్ను వాళ్లంద‌రికంటే మిన్న‌గా ప్రేమిస్తున్నారు. అన్నిటికంటే దేశానికి సంబంధించిన ఆత్మ గౌర‌వం ఈ విజ‌యం. ఇవాళ నాకంటే దేశ‌పు ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు. వాళ్లు తాము విజ‌యం సాధించినంత‌గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక్క ఆట లోనే సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నాడు లియోనెల్ మెస్సీ.

ఆట అంటేనే గెలుపు ఓట‌ముల స‌మ్మేళ‌నం. మేం ఓడి పోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. గెలిచిన ఆనందాలు కూడా చెప్పుకోద‌గ్గ రీతిలో చోటు చేసుకున్నాయి. ఈ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ మాత్రం మాకు ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంద‌ని పేర్కొన్నాడు మెస్సీ(Lionel Messi). యావ‌త్ ప్ర‌పంచం మెస్సీని కీర్తిస్తోంది. అర్జెంటీనా విజ‌యాన్ని అభినందిస్తోంది.

Also Read : మ‌ధుర‌ క్ష‌ణం మెస్సీ కుటుంబం ఆనందం

Leave A Reply

Your Email Id will not be published!