Shane Warne : కొంప‌ముంచిన లిక్విడ్ డైట్

వార్న్ రిపోర్ట్ లో ఆస‌క్తిక‌ర విష‌యాలు

Shane Warne  : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గ‌జం షేన్ వార్న్ 52 ఏళ్ల‌కే ఆక‌స్మికంగా మ‌ర‌ణించాడు. ఆయ‌న మ‌ర‌ణంపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి ప్ర‌పంచ వ్యాప్తంగా. యావ‌త్ క్రీడా లోకం తీవ్ర విషాదానికి లోనైంది.

థాయ్ లాండ్ లోని త‌న స్వంత విల్లాలో అనుమానాస్ప‌ద స్థితిలో విగ‌త జీవిగా ప‌డి ఉండ‌డం మ‌రింత అనుమానం వ్య‌క్త‌మైంది. షేన్ వార్న్ భౌతిక కాయాన్ని ఆస్ట్రేలియాకు త‌ర‌లించారు.

అంత‌కు ముందు థాయ్ లాండ్ పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఇందులో భాగంగా వార్న్(Shane Warne )గ‌దిలో బెడ్ పై, ట‌వాల్ పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉండ‌డాన్ని గ‌మ‌నించారు.

అయితే విప‌రీత‌మైన గుండె నొప్పితో బాధ ప‌డుతూ త‌ట్టుకోలేకే ఇలా జ‌రిగింద‌ని షేన్ వార్న్ స్నేహితులు వెల్ల‌డించారు పోలీసుల‌కు. వార్న్ మ‌ర‌ణం వెనుక ఉన్న మిస్ట‌రీని ఛేదించే ప‌నిలో పురోగ‌తి సాధించారు.

విచిత్రం ఏమిటంటే వార్న్ బ‌రుగు త‌గ్గేందుకు క‌ఠిన‌మైన లిక్విడ్ తో కూడుకున్న డైట్ ఫాలో అయ్యాడ‌ని తెలిసింది. ఇది 14 రోజుల పాటు తీసుకోవ‌డం.

ఇదే వార్న్ చావుకు ప్ర‌ధాన కార‌ణంగా మారింద‌ని పోలీసులు త‌మ విచార‌ణ‌లో నిగ్గు తేల్చారు. గ‌తంలో కూడా ఇలాంటి అర్థం ప‌ర్థం లేని డైట్ ఫాలో అయ్యేవాడంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పాడు వార్న్ (Shane Warne )మేనేజ‌ర్ జేమ్స్ .

ఎందుక‌నో అనుమానం వ‌చ్చి హార్ట్ స్పెష‌లిస్ట్ ను కూడా క‌న్స‌ల్ట్ చేశాడ‌ని తెలిపాడు. ఈ క్రికెట్ దిగ్గ‌జం మొత్తంగా గుండె పోటుతోనే చ‌ని పోయాడంటూ అటాప్సీ నివేదిక‌లో వెల్ల‌డైంద‌ని థాయ్ లాండ్ పోలీసులు ప్ర‌క‌టించారు.

దీంతో ఈ క్రికెట్ దిగ్గ‌జం మ‌ర‌ణం వెనుక మిస్ట‌రీ వీడింది.

Also Read : వార్న్ మ‌ర‌ణం త‌ట్టుకోలేక పోతున్నా

Leave A Reply

Your Email Id will not be published!