Signal App Comment : లిక్కర్ స్కాం @ సిగ్నల్ యాప్ లింక్
వెన్నమనేని..పిళ్లై మధ్య సంభాషణలు
Signal App Comment : ఢిల్లీ టు హైదరాబాద్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కువగా వాడుతున్న ఏకైక పదం. లిక్కర్ స్కాం ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.
దేశ వ్యాప్తంగా 40 చోట్ల దాడులు చేపట్టింది. ఇదే సమయంలో మొత్తం ఫోకస్ అంతా హైదరాబాద్ పై పెట్టింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మొత్తం ఈ కేసులో కీలకమైన వ్యక్తులు బయట పడ్డారు.
మొత్తం కేసుకు సంబంధించి 14 మందిపై అభియోగాలు మోపింది. మొదటి పేరు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను చేర్చింది. ఆ తర్వాత రాబిన్ డిస్ట్ లరీస్ కు సంబంధించి రామచంద్రన్ పిళ్లైని విచారించింది.
అనంతరం హైదరబాద్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవితకు చెందిన వ్యక్తిగత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుపై దాడులు చేపట్టంది. మొత్తం రిజిస్టర్డ్ , షెల్ కంపెనీల చిట్టా బయట పడింది.
కాగా విచిత్రం ఏమిటంటే ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ రావుకు సంబంధించి బినామీగా ఉన్న కల్వకుంట్ల కుటుంబానికి చెందిన కరీంనగర్ బిల్డర్ వెన్నమనేని శ్రీనివాస్ రావును అదుపులోకి తీసుకుంది.
7 గంటల పాటు విచారించింది. ఆయనకు సంబంధించిన 14 కంపెనీలను జల్లెడ పట్టింది. ఇందులో చిరునామాలున్నా ఆఫీసులు లేక పోవడంతో అతడి ద్వారా మొత్తం రూ. 2,000 కోట్లకు పైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారినట్లు గుర్తించింది ఈడీ.
ఒక్క పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రూ. 200 కోట్లు ఆప్ కు జార వేసినట్లు అనుమానిస్తోంది. ఈ మొత్తం కోట్లాది రూపాయల లావాదేవీలు షెల్ కంపెనీలు, హవాలా , తదితర మార్గాలలో జరిపినట్లు ఈడీ పేర్కొంది.
ఇదే సమయంలో కీలకమైన డాక్యుమెంట్లను పిళ్లై, వెన్నమనేని శ్రీనివాసరావు, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు నుంచి స్వాధీనం చేసుకుంది. మొత్తం బండారం బట్ట బయలు కావడంతో గులాబీ వర్గాలలో గుబులు రేగింది.
ఈ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సంచలన ప్రకటన చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. అదేమిటంటే వెన్నమనేని శ్రీనివాసరావు, రామచంద్రన్ పిళ్లైలు ఎవరూ గుర్తించకుండా, ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు అద్భుతమైన ప్లాన్ వేశారు.
అదేమిటంటే మొబైల్స్, వాట్సాప్, ఈమెయిల్స్ కాకుండా – సిగ్నల్ యాప్ -ను(Signal App) వాడినట్లు ప్రకటించింది ఈడీ. ఈ యాప్ వాడితే ఎవరూ పట్టుకోలేరు. గుర్తించ లేరు.
ఎలాంటి మెస్సేజ్ పంపినా దానికి సంబంధించిన ఆధారాలు అంటూ దొరకవు. సో మొత్తం స్కాంలో వెన్నమనేని చుట్టే ఇప్పుడు తిరుగుతోంది కథంతా. రానున్న రోజుల్లో ఇంకెంత మంది దొంగలు బయట పడతారనేది వేచి చూడాలి.
Also Read : నీరా రాడియా టేప్లపై సుప్రీం ఆదేశం