Living Stone : చుక్క‌లు చూపించిన లివింగ్ స్టోన్

22 బంతులు 2 ఫోర్లు 5 సిక్స‌ర్లు

Living Stone : ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన కీల‌క పోరులో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌న స్థానాన్ని 7వ ప్లేస్ తో భ‌ర్తీ చేసింది.

ప‌రువు పోకుండా కాపాడుకుంది. ఇక ఎప్ప‌టి లాగే స‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ గ్రూప్ యాజ‌మాన్యం తీసుకున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌న ఆట తీరుతో ఆక‌ట్టు కోలేక పోయింది. లీగ్ ప్రారంభంలో అద‌ర‌గొట్టినా చివ‌ర‌కు చేతులెత్తేసింది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 157 ర‌న్స్ చేసింది. కెప్టెన్ విలియ‌మ్స‌న్ లేకుండానే బ‌రిలోకి దిగింది. టోర్నీలో ఆడ‌కుండానే స్వ‌దేశానికి చెక్కేశాడు.

దీంతో ఆయ‌న స్థానంలో భువనేశ్వ‌ర్ కుమార్ నాయ‌క‌త్వం వ‌హంచాడు. అభిషేక్ వ‌ర్మ‌, త్రిపాఠి రాణించారు. ఇక 158 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ టెన్ష‌న్ లేకుండానే కూల్ గా విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది ఆ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న లియామ్ లివింగ్ స్టోన్(Living Stone) గురించి. కేవ‌లం 22 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. ఇందులో 2 ఫోర్లు 5 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి.

ఎక్క‌డా త‌గ్గ‌లేదు. మిగ‌తా బ్యాట‌ర్లు ఆడేందుకు ఇబ్బంది ప‌డుతుంటే త‌ను మాత్రం క‌ళ్లు చెదిరేలా జ‌మ్మూ కాశ్మీర్ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ అద్భుత‌మైన సిక్స్ కొట్టాడు.

త‌ను నాటౌట్ గా ఉంటూ పంజాబ్ కింగ్స్ కు కీల‌క విజ‌యాన్ని అందించాడు. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో 7 విజ‌యాలు సాధించి ఆరో స్థానంలో నిలిచింది. మెరుగైన ర‌న్ రేట్ కార‌ణంగా కేకేఆర్ ఏడో స్థానంలోకి చేరింది.

Also Read : పుజారా టెస్టుకు మాలిక్ టీ20కి ఎంపిక

Leave A Reply

Your Email Id will not be published!